SBI Bank Jobs 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 996 ఖాళీలు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా — ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూతోనే ఎంపిక జరగనుండటం ఈ నోటిఫికేషన్‌కి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.
డిసెంబర్ 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా డిసెంబర్ 23, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 996
పోస్టుల వివరాలు
VP Wealth (SRM) – 506 పోస్టులు
AVP Wealth (RM) – 206 పోస్టులు
Customer Relationship Executive – 284 పోస్టులు
అర్హతలు
సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి.
నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి (01-05-2025 నాటికి)
20 నుంచి 42 సంవత్సరాలు (పోస్టు ఆధారంగా మారుతుంది)
OBC: +3 సంవత్సరాలు సడలింపు
SC/ST: +5 సంవత్సరాలు సడలింపు
PwBD: +10 సంవత్సరాలు సడలింపు
దరఖాస్తు ఫీజు
General/OBC/EWS: ₹750
SC/ST/PwBD: ఫీజు లేదు
ఎంపిక విధానం
ఎలాంటి రాత పరీక్ష లేదు
ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే తుది ఎంపిక
దరఖాస్తు చివరి తేదీ
➡ December 23, 2025
అర్హత ఉన్న అభ్యర్థులు తమ వివరాలు సరిచూసుకుని వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://sbi.bank.in/web/careers/current-openings
ఇవీ చదవండి:
