HomeAgricultureAndhra Pradesh Farmers: వ్యవసాయ రుణాల్లో ఏపీకి రెండో స్థానం.. అప్పుల ఊబిలో రైతులు, పెరుగుతున్న...

Andhra Pradesh Farmers: వ్యవసాయ రుణాల్లో ఏపీకి రెండో స్థానం.. అప్పుల ఊబిలో రైతులు, పెరుగుతున్న ఆత్మహత్యలు

Andhra Pradesh Farmers: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. పంటలకు సరైన మద్దతు ధరలు లేకపోవడం, పెట్టుబడి సాయం తగ్గిపోవడం, పంట బీమా నిలిచిపోవడం వంటి కారణాలతో రైతులు భారీగా అప్పుల్లో కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌లో వెల్లడించారు.

ఏపీలో భారీగా వ్యవసాయ రుణాలు
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.3,75,254.59 కోట్లు ఉన్నాయి. ఇందులో పంట రుణాలు – రూ.2,01,744.41 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు – రూ.1,73,510.18 కోట్లు. దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణాలు మొత్తం రూ.31,34,807.42 కోట్లుగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇందులో పంట రుణాలు రూ.16,34,219.07 కోట్లు కాగా టర్మ్ రుణాలు రూ.15,00,588.35 కోట్లు ఉన్నాయి.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే రూ.5,06,290.45 కోట్లతో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.1,75,960.56 కోట్లుగా నమోదయ్యాయి.

55 శాతం రైతు కుటుంబాలకు మాత్రమే రుణ సౌకర్యం
నేషనల్ రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే ప్రకారం దేశంలో 55 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే క్రెడిట్ సౌకర్యాన్ని పొందుతున్నాయి. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

పెట్టుబడి సాయం తగ్గిందని విమర్శలు
రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం తగ్గిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది పూర్తిగా అమలు కాలేదని విమర్శలు ఉన్నాయి.

రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉండగా అందరికీ పూర్తి స్థాయిలో సాయం అందలేదని చెబుతున్నారు. రెండేళ్లలో రైతులకు ఇవ్వాల్సిన రూ.21,433 కోట్ల పెట్టుబడి సాయంలో కేవలం రూ.4,685 కోట్లే విడుదలయ్యాయని ఆరోపణలు ఉన్నాయి.

పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ సమస్య
ఉచిత పంటల బీమా అమలులో సమస్యలు తలెత్తినట్లు రైతు సంఘాలు చెబుతున్నాయి. 2023–24 వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన రూ.930 కోట్ల ప్రీమియం చెల్లింపులు ఆలస్యమవడంతో రైతులకు రావాల్సిన రూ.1,324 కోట్ల బీమా పరిహారం నిలిచిపోయిందని ఆరోపిస్తున్నారు.

అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీలు కూడా పూర్తిగా అందలేదని రైతులు అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పటికీ సరైన సహాయం అందలేదని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

మద్దతు ధరలు లేక రైతుల ఇబ్బందులు
ధాన్యం, పత్తి, మిరప, ఉల్లి, టమాటా, పసుపు, పెసర, మినుము వంటి పంటలకు సరైన కనీస మద్దతు ధర (MSP) అందకపోవడం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. పెట్టుబడి ఖర్చులు పెరగడం, ప్రకృతి వైపరీత్యాలు వరుసగా రావడం వల్ల రైతులకు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయి.

పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. గత 20 నెలల్లో వందల సంఖ్యలో రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. పోలీస్ శాఖ గణాంకాల ప్రకారం

ఒక ఏడాదిలో 150 మందికి పైగా రైతులు
2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ పరిణామాలు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను స్పష్టంగా చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

ఇవీ చ‌ద‌వండి: Andhra Pradesh Farmers: రైతుల బాధలు పట్టని కూటమి సర్కార్.. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల ప్రకటనలు
Andhra Pradesh: Iran–US conflict affect of India’s Agri exports… Basmati exports at risk, farmers fear losses
Andhra Pradesh agriculture : పచ్చి రొట్ట ఎరువు సాగు లేకుండా భూసారం పెరగదు.. విత్తనాల ధరలు రైతులకు పెనుభారం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు