HomeAgricultureAndhra Pradesh agriculture : పచ్చి రొట్ట ఎరువు సాగు లేకుండా భూసారం పెరగదు.. విత్తనాల...

Andhra Pradesh agriculture : పచ్చి రొట్ట ఎరువు సాగు లేకుండా భూసారం పెరగదు.. విత్తనాల ధరలు రైతులకు పెనుభారం

Andhra Pradesh agriculture : భూసారం పెరగాలన్నా, రసాయనిక ఎరువులపై ఆధారాన్ని తగ్గించాలన్నా పచ్చి రొట్ట ఎరువు సాగు అత్యంత కీలకం. కానీ ఈ సాగుకు అవసరమైన విత్తనాల ధరలు ప్రస్తుతం రైతులకు అందని ద్రాక్షలా మారాయి. ఎంవీఎస్ నాగిరెడ్డి, MSc., YSRCP ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

విజయవాడ కాళేశ్వరరావు హోల్‌సేల్ మార్కెట్‌లో ప్రస్తుతం
పిల్లి మిసర్లు (Dhaincha) విత్తనాలు – కిలో రూ.350 (క్వింటాలు రూ.35,000)
జీలగ (Sun Hemp) విత్తనాలు – కిలో రూ.150 (క్వింటాలు రూ.15,000)
ఇంత అధిక ధరలకు రైతులు విత్తనాలు కొనలేని పరిస్థితి నెలకొంది. పైగా కృష్ణా జిల్లా సహా చాలా ప్రాంతాల్లో ఇవి అందుబాటులో కూడా లేవని పేర్కొన్నారు.
పిల్లి మిసర్లు (Dhaincha) – భూసారానికి వరం
పిల్లి మిసర్లు పచ్చి రొట్ట ఎరువుగా ఉపయోగిస్తే
నేలలో సేంద్రీయ పదార్థం పెరుగుతుంది
నైట్రోజన్ స్థాయి మెరుగుపడుతుంది
భూసారం సహజంగా పెరుగుతుంది
రెండో పంట కోతయ్యాక నుంచి తొలకరి లోపు ఈ పంటను సాగు చేస్తే, తదుపరి పంటకు ఎంతో మేలు చేస్తుంది.

జీలగ (Sun Hemp) – సహజ ఎరువుకు ఉత్తమ ఎంపిక
జీలగ పచ్చి రొట్ట ఎరువుగా వాడితే
నేల నిర్మాణం మెరుగుపడుతుంది
రసాయనిక ఎరువుల అవసరం కొంతవరకూ తగ్గుతుంది
పంట దిగుబడి స్థిరంగా పెరుగుతుంది

రైతుల వేదన – ద్వంద్వ వైఖరి
ఒకవైపు ప్రభుత్వం రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలంటోంది. మరోవైపు రైతులు పండించే పెసర, మినుము, శనగ వంటి ప్రోటీన్ పంటలకు సరైన కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో పచ్చి రొట్ట ఎరువు విత్తనాలను భారీ ధరలకు కొనుగోలు చేసి సాగు చేయడం రైతులకు సాధ్యం కాదని నాగిరెడ్డి స్పష్టం చేస్తున్నారు.

పరిష్కారం ఏంటి?
పచ్చి రొట్ట ఎరువు విత్తనాలను 90% సబ్సిడీపై ఇవ్వాలి
కనీసం 75% సబ్సిడీ అయినా అందించాలి
మార్చ్ మొదటి వారానికల్లా రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉంచాలి
ఈ విత్తనాలు పచ్చి రొట్ట సాగుకే ఉపయోగపడతాయని గుర్తించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి

నిజంగా భూసారం పెరగాలి, రసాయనిక ఎరువుల వాడకం తగ్గాలి అనుకుంటే పచ్చి రొట్ట ఎరువు సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విత్తనాల సబ్సిడీతోనే ఇది సాధ్యమవుతుందని రైతు నేతలు స్పష్టం చేస్తున్నారు.

-mvs nagi reddy

ఇవీ చ‌ద‌వండి: Andhra Pradesh : శనగ రైతులకు అండగా నిలవాల్సిన సమయం ఇదే.. దిగుమతి సుంకాల పెంపు – MSP బోనస్ అవసరం
Andhra Pradesh : సాగునీటి సంఘాలకు జీఎస్టీ మినహాయింపు – ప్రతి ఎకరాకు నీరివ్వడమే ప్రభుత్వ లక్ష్యం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు