Tamannaah Bhatia: గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే కేవలం అందం సరిపోదు… ఆరోగ్యం, ఫిట్‌నెస్ కూడా అంతే కీలకం. ఈ విషయంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఎప్పుడూ షార్ట్‌కట్స్ వెతకదు. ఆమె పూర్తిగా తన ట్రైనర్ చెప్పే సైంటిఫిక్ పద్ధతులనే అనుసరిస్తుంది. తాజాగా ఆమె ఫిట్‌నెస్ గురు Siddharth Singh త్వరగా బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కొన్ని ముఖ్యమైన నిజాలు వెల్లడించారు. మనం సాధారణంగా మంచి అనుకునే కొన్ని అలవాట్లు నిజానికి మన శరీరానికి నష్టం కలిగిస్తున్నాయంటున్నారు.
కార్బ్స్ పూర్తిగా మానేయడం – పెద్ద పొరపాటు
చాలామంది త్వరగా బరువు తగ్గాలనే ఆశతో కార్బోహైడ్రేట్స్‌ను పూర్తిగా డైట్ నుంచి తీసేస్తుంటారు. కానీ ఇది తాత్కాలికంగా బరువు తగ్గించినా, దీర్ఘకాలంలో హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది.
సిద్ధార్థ్ సింగ్ మాటల్లో చెప్పాలంటే – కార్బ్స్ మానేస్తే తీవ్రమైన ఆకలి, అలసట, మూడ్ స్వింగ్స్ వస్తాయి. అందుకే సరైన మార్గం క్యాలరీ డెఫిసిట్ పాటిస్తూ, తగినంత ప్రోటీన్‌తో పాటు పరిమితంగా కార్బ్స్ తీసుకోవడం.
డిటాక్స్ టీలు – మార్కెటింగ్ మాయ
మార్కెట్లో దొరికే డిటాక్స్ టీలు, క్లెన్సింగ్ డ్రింక్స్ అన్నీ మోసపూరితమైనవే అని ఆయన స్పష్టం చేశారు. మన శరీరంలో లివర్, కిడ్నీలు సహజంగానే డిటాక్స్ చేసే శక్తి కలిగి ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. రోజూ కొద్దిగా నడక లేదా వ్యాయామం చేయడం చాలంటున్నారు.
నిద్రను తక్కువగా తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది
బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. కానీ నిద్ర సరిగ్గా లేకపోతే శరీరంలో ఆకలి హార్మోన్లు పెరుగుతాయి, రికవరీ తగ్గుతుంది. ఫలితంగా శరీరం ఎక్కువ కొవ్వును నిల్వ చేసుకుంటుంది. ఫిట్‌నెస్ కోరుకునేవారు తప్పనిసరిగా రోజుకు 7–8 గంటల నాణ్యమైన నిద్ర తీసుకోవాలి.
సప్లిమెంట్లకంటే బేసిక్స్ ముఖ్యం
అనవసరమైన సప్లిమెంట్లు, మేజిక్ పిల్స్ వెతకడం మానేసి బేసిక్ లైఫ్‌స్టైల్ మార్పులపై దృష్టి పెట్టాలని సిద్ధార్థ్ సూచిస్తున్నారు.
సమతుల్య ఆహారం
క్రమమైన వ్యాయామం
సరైన నిద్ర ఈ మూడు ఉంటే చాలంటున్నారు.
తమన్నా ఫిట్‌నెస్ తత్వం
తమన్నా లాంటి ఫిట్ బాడీ కావాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరం. తక్షణ ఫలితాల కోసం ప్రమాదకరమైన మార్గాలు ఎంచుకోకుండా, సహజమైన పద్ధతుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఉత్తమ మార్గం.
ఇవీ చదవండి: Tamannah Bhatia : మిల్కీ బ్యూటీ మరో సీక్రెట్.. గ్లో రహస్యం ఇదే.. ఇంట్లోనే చేసే ఈ ఫేస్ మాస్క్‌తో చలిలోనూ అద్భుత కాంతి
Tamannah : ఆఫర్స్ కాదు.. డిమాండ్ టాప్ గేర్! 6 నిమిషాలకు రూ.6 కోట్లా? తమన్నా సంచలనం!
Tamannah Bhatia : మైసూరు శాండిల్ తెచ్చిన తంటా.. తమన్నాపై విమర్శలు!
