HomeAgricultureAndhra Pradesh : కూటమి ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యల ఘోష.. వాస్తవాలకు పాతరేశారా?

Andhra Pradesh : కూటమి ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యల ఘోష.. వాస్తవాలకు పాతరేశారా?

Andhra Pradesh : కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతోందని వ్యవసాయ రంగ నిపుణుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల విషయంలో కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటైతే, క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం ఇచ్చిన గణాంకాలు మభ్యపెట్టేలా ఉన్నాయని ఆక్షేపించారు. దీనిపై ఆయన విశ్లేషణ.

ఈ మధ్యనే వ్యవసాయం శాఖ కమీషనర్ గారి ప్రకటన ప్రకారం 112 మంది రైతులు ఆత్మ హత్యలు జరిగినాయని ప్రకటించారు. YSRCP అనేక సార్లు చేసిన డిమాండ్ మేరకు ఈ ఆత్మ హత్యల సంఖ్యను ప్రకటించారు..
ఇదే ఆత్మ హత్యల పై శ్రీ దేవులపల్లి నాగరాజు, అనే వ్యక్తి పార్వతీపురం మన్యం జిల్లా నుండి సమాచార చట్టం క్రింద అడిగితే 107 మంది రైతులు జూన్ 1/2024 నుండి ఆత్మ హత్య చేసుకున్నారని..ఈ 107 మందికి పరిహారం విడుదల కావలసి యున్నదని సమాధానం పంపి యున్నారు..

వీరికి 2020 ఫిబ్రవరి లో జగన్ మోహన రెడ్డి గారు ప్రకటించిన GO no 43 ప్రకారం మాత్రమే పరిహారం 7 లక్షలు ఇస్తామని వీరికి చెల్లింంపులకు బిల్లులు CFMS లో ఎక్స్ గ్రాషియో విడుదలకు ఉన్నవి. అక్కడ శాంక్షన్ అయిన తరువాత వారి కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని ఇచ్చారు..
6 సంవత్సరాల తరువాత కూడా పరిహారం పెంచలేదు..ఈ పరిహారం కూడా ఎప్పుడు ఇస్తారో ప్రకటించలేదు..
క్షేత్ర స్థాయి పరిస్థితికి ఈ ఆత్మ హత్య ల సంఖ్య ఏ మాత్రం కూడా వాస్తవం గా లేదు..ఈ ప్రకటన..

వ్యవసాయ శాఖ సమాచార చట్టం ప్రకారం తెలిపిన జిల్లాల వారీ పెండింగ్ లో ఉన్న ఆత్మ హత్యల పరిహారం దరఖాస్తుల వివరాలు..
అనంతపురం 23
కర్నూలు 20
నంద్యాల 15
సత్యసాయి 12
వై యస్ ఆర్ 19
——–
రాయలసీమ 89
ప్రకాశం 8
బాపట్ల 3
పల్నాడు 3
నెల్లూరు 2
గుంటూరు 2
ఎన్ టి ఆర్ 2
ఏలూరు 1
కోనసీమ 1
——-
111
ప్రకటించిన మొత్తం 111 మంది లో 89 మంది రాయలసీమ జిల్లా ల లోనే..రాయలసీమ జిల్లాలలో రైతులపై ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయని అనేక నెలలుగా చెబుతున్నాం..అధికార యంత్రాంగం ప్రకటించిన వివరాలు అది వాస్తవం అని తెలియ జేస్తున్నది..
2024, 2025 లో ఏ జిల్లాలలో అయితే పంటలు సాగు తగ్గి, దిగుబడి తగ్గి, ఆ ఉత్పత్తు లను కూడా నష్టాలకు (Distress Sale) కి అమ్ముకున్నారో ఆ జిల్లా లలోనే ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ హత్యలు ఎక్కువ ఉన్నాయి..

ఈ ప్రకటించిన ఆత్మ హత్యల సంఖ్య ఏ మాత్రం క్షేత్ర స్థాయి వాస్తవాలకు కనీసం దగ్గరగా నైనా లేదు..

ఒక్క పల్నాడు జిల్లా లోనే కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన దగ్గర నుండి 2025 అక్టోబర్ నెల ఆఖరు వరకు 29 మంది మిర్చి, పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రముఖ BBC తెలుగు News లో వివరణాత్మక కథనం ప్రచారం చేసినది..కానీ అధికార యంత్రాంగం ప్రకటించినది ఈ జిల్లా లో 3.
క్షేత్ర స్థాయి లో చిత్త శుద్ధితో బాధ్యతా యుతంగా పరిశీలిస్తే ఇదే పరిస్థితి ప్రతి జిల్లలోనూ ఉంటుంది..

ఆత్మ హత్యలు సమస్యకు పరిష్కారం కాదు.. ఆత్మహత్యలు చేసుకుని మీ కుటుంబాలను ఆనాధలు చెయ్యవద్దని రైతులకు మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం..

ఆత్మ హత్య జరిగిన తరువాత నైనా ఆ కుటుంబానికి మేమున్నాం అని భరోసా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఆత్మ హత్యలను సరిగా రికార్డ్ చెయ్యకుండా ఆత్మ హత్యలు పెద్దగా లేవని చెప్పేలా ప్రయత్నించడం చాలా బాధాకరమైన విషయం..
రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నది ఎక్కువగా కవులు రైతులు, సన్న, చిన్న కారు రైతులు..
వీరి ఆర్ధిక స్థితి పై తక్షణమే ద్రుష్టి పెట్టకపోతే ఇప్పటికే సంక్షోభం లో ఉన్న రాష్ట్రం లోని అనేక పంటల రైతులు సాగు మనుగడే ప్రమాదంలో పడుతుంది..

రైతుల ఆత్మ హత్యల విషయంలో డా. వై యస్ రాజ శేఖర రెడ్డి గారు కానీ జగన్ మోహన రెడ్డి గారు కానీ ఎంతో మానవత్వం తో వ్యవహరించిన విషయం అందరికీ తెలిసినదే..

డా. వై యస్ రాజశేఖరరెడ్డి గారు అధికారం లోనికి వచ్చిన వెంటనే 2004 జూన్ నెల లోనే GO no. 421 విడుదల చేసి ఆత్మ హత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 2 లక్షలు పరిహారం ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ఉన్న కాలం లో జరిగిన ఆత్మహత్యలకు కూడా ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వడం జరిగినది..

జగన్ మోహన రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తరువాత GO no 43 విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ఉన్న 2014 నుండి మే 2019 వరకూ రైతు ఆత్మహత్య లపై పునర్విచారణ జరిపి 470 కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించారు..
ఆయన ముఖ్యమంత్రి గా ఉన్న కాలం లో 1/6/2019 నుండి 22/2/2024 వరకు జరిగిన ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 7 లక్షలు చొప్పున 1370 కుటుంబాలకు పరిహారం అందించిన విషయం అందరికీ తెలిసినదే..

2020 ఫిబ్రవరి లో విడుదల చేసిన పరిహారం 7 లక్షలు పెంచకుండా 2024 జూన్ నుండి జరిగిన ఆత్మహత్యల కుటుంబాలకు ఇప్పటి వరకూ పరిహారం అందించ కుండా ఆ కుటుంబాలకు భరోసా ఎలా ఇస్తాము..

అన్నదాతల కుటుంబం రైతు ఆత్మహత్యతో ఆనాధలుగా మారి మానసిక వేదనతో కన్నీరు పెట్టడం ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిది కాదు..

ఆత్మహత్య లను బాధ్యతా యుతంగా మానవత్వంతో పరిశీలించి, వారికి 2020 లో ప్రకటించిన పరిహారం 7 లక్షలు 2026 లో చెల్లించాలని చూడకుండా ఇన్ ఫ్లేషన్ ప్రకారం పెంచి, ప్రతి కుటుంబ పరిహారాన్ని త్వరితంగా చెల్లించవలసిన బాధ్యత ను అధికార యంత్రాన్గానికి గుర్తు చేస్తూ..భూమిని సాగు చేసి పంట పండించిన తరువాత ఉత్పత్తికి ధర లేక పెట్టిన పెట్టు బడి కూడా రాని సందర్బంలో అప్పు పెట్టిన వారికి సమాధానం చెప్పలేక, తన కుటుంబానికి కనీస అవసరాలు కూడా తీర్చలేక ఆత్మాభి మానాన్ని చంపుకోలేక
చేసుకుంటున్న ఆత్మ హత్య లను ధర్మ బద్దంగా, బాధ్యతా యుతంగా మాన వత్వంతో చూడవలసినదిగా అధికార యంత్రాన్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను..

– ఎంవీఎస్ నాగిరెడ్డి, M. Sc,.
YSRCP General Secretary,
(Agriculture.Farmers Wellfare),
Former Vice Chairman,
AP State Agriculture Mission.

ఇవీ చదవండి: YSRCP Meeting : విద్య, వైద్యం, వ్యవసాయం.. అన్నింటా రాష్ట్రం తిరోగమనం: జగన్
Collectors Conference : మార్చి 2026 నాటికి సోలార్ 2.93 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లు
Andhra: వేరుశనగ రైతుకు ఊరట.. మార్కెట్ చరిత్రలోనే హిస్టరీ క్రియేట్ చేసిన ధర

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు