Gold price : అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి, దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం పసిడి మార్కెట్‌పై తీవ్రంగా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఎగసిపడుతుండగా, దాని ప్రభావం దేశీయ మార్కెట్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లు వరుసగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత వారం ఒక్కసారిగా దాదాపు రూ.3 వేల వరకు పెరిగిన బంగారం ధర, ఈ వారం కూడా తగ్గే సూచనలు ఇవ్వడం లేదు.
సోమవారం భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు, మంగళవారం కూడా స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. అయితే పెరుగుదల పరిమితంగా ఉండటంతో కొనుగోలుదారులు కొంత ఊరట పొందుతున్నారు. జనవరి 20 నాటికి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
నేటి బంగారం ధరలు
హైదరాబాద్
10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర: రూ.1,46,250
సోమవారం ధర: రూ.1,46,240
నిన్నటితో పోలిస్తే రూ.10 పెరుగుదల
22 క్యారెట్ల బంగారం ధర: రూ.1,34,060
సోమవారం ధర: రూ.1,34,050
విజయవాడ – విశాఖపట్నం
24 క్యారెట్ల బంగారం: రూ.1,46,250
22 క్యారెట్ల బంగారం: రూ.1,34,060
చెన్నై
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,46,740
సోమవారం ధర: రూ.1,46,730
22 క్యారెట్ల బంగారం: రూ.1,34,510
సోమవారం ధర: రూ.1,34,500
బెంగళూరు
24 క్యారెట్ల బంగారం: రూ.1,46,250
22 క్యారెట్ల బంగారం: రూ.1,34,060
ఢిల్లీ
24 క్యారెట్ల బంగారం: రూ.1,46,400
22 క్యారెట్ల బంగారం: రూ.1,34,210
వెండి ధరలు ఇలా..
ఢిల్లీ
కేజీ వెండి ధర: రూ.3,05,100
సోమవారం ధర: రూ.3,05,000
రూ.100 పెరుగుదల
హైదరాబాద్
కేజీ వెండి ధర: రూ.3,18,100
నిన్న ధర: రూ.3,18,000
చెన్నై, బెంగళూరు
కేజీ వెండి ధర: రూ.3,18,100
కొనుగోలుదారులకు టెన్షన్
వరుసగా ధరలు పెరుగుతుండటంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు మారే వరకు పసిడి ధరల్లో తగ్గుదల కనిపించే అవకాశం తక్కువగా ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: Gold Rate Today: తగ్గుముఖం పట్టిన బంగారం – వెండి ధరలు… హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే?
Gold : నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? బంగారం నిల్వపై చట్టం ఏం చెబుతుందో తెలుసా?
