HomeBusinessGold : నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? బంగారం నిల్వపై చట్టం ఏం...

Gold : నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? బంగారం నిల్వపై చట్టం ఏం చెబుతుందో తెలుసా?

Gold : భారతీయ కుటుంబాల్లో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు… సంప్రదాయం, భద్రత, ప్రతిష్ఠకు చిహ్నం. అందుకే ప్రతి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉండటం సహజం. అయితే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో, ఇంట్లో ఎక్కువ మొత్తంలో బంగారం ఉంచుకుంటే ఆదాయపు పన్ను శాఖ ఇబ్బంది పెడుతుందా? చట్టపరంగా ఇది నేరమా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.

వాస్తవం ఏంటంటే… ఎక్కువ బంగారం ఉంచుకోవడం చట్టవిరుద్ధం కాదు. కొన్ని నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను తనిఖీల సమయంలో గృహ ఆభరణాలకు రక్షణ కూడా ఉంటుంది.

CBDT స్పష్టత ఏమంటోంది?
ఈ అంశంపై Central Board of Direct Taxes (CBDT) మే 11, 1994న జారీ చేసిన ఇన్‌స్ట్రక్షన్ నంబర్ 1916 కీలక మార్గదర్శకాలను అందిస్తోంది.
ఈ సూచన ప్రకారం:
ఒక వ్యక్తి ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చన్న దానిపై పరిమితి విధించలేదు
కానీ ఆదాయపు పన్ను సోదాల (Income Tax Raids) సమయంలో ఎంత బంగారాన్ని స్వాధీనం చేసుకోకూడదు అన్నది స్పష్టంగా పేర్కొన్నారు

బంగారం కొనుగోలు బిల్లులు వెంటనే చూపించలేకపోయినా, సంప్రదాయ గృహ ఆభరణాలను స్వాధీనం చేసుకోవద్దని ఆదేశాలు ఉన్నాయి

ఆదాయపు పన్ను రైడ్స్‌లో ఎంత బంగారం సురక్షితం?
CBDT ఇన్‌స్ట్రక్షన్ 1916 ప్రకారం, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 132 కింద సోదాలు నిర్వహించినప్పుడు ఈ పరిమితుల్లో ఉన్న బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకోరాదు:
👩 వివాహిత మహిళ – 500 గ్రాముల వరకు
👩‍🦰 అవివాహిత మహిళ – 250 గ్రాముల వరకు
👨 కుటుంబంలోని పురుష సభ్యుడు – 100 గ్రాముల వరకు

ఈ పరిమితుల్లో ఉన్న బంగారం సంప్రదాయంగా సంపాదించిందేనని భావించి, వాటిపై చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం
బంగారం పరిమితికి మించి ఉన్నా, దానికి సరైన ఆదాయ వనరులు, పన్ను వివరాలు ఉంటే సమస్య ఉండదు
కుటుంబ సంప్రదాయాలు, వివాహ సందర్భాల్లో వచ్చిన ఆభరణాలకు చట్టపరమైన రక్షణ ఉంటుంది
అయితే అక్రమ ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారంపై మాత్రం చర్యలు తప్పవు
అందుకే బంగారం కొనుగోలు చేసినప్పుడు రికార్డులు భద్రపరచుకోవడం ఎప్పుడూ మంచిదే.

ఇవీ చదవండి: Intresting Foods : బంగారంకన్నా ఖరీదైన ఆహారం! ఈ రెండు ఫుడ్స్ గురించి చూస్తే ఆశ్చర్యపోతారు!
Gold Price : మళ్లీ ఎగబాకిన బంగారం ధరలు.. రాత్రికి రాత్రే భారీ మార్పులు.. బుధవారం రేట్లు ఎలా ఉన్నాయంటే?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు