Viral Video: సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి కుటుంబాల విధ్వంసానికి, మరికొన్నిసార్లు హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్లుతున్నాయి. అలాంటి ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో నడి రోడ్డుపై జరిగిన ఈ హైడ్రామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తోంది. భర్తను అతని ప్రియురాలితో కలిసి చూసిన భార్య ఆగ్రహానికి లోనై, అక్కడికక్కడే ఆమెపై దాడి చేసిన ఘటన ఇది.
ఏం జరిగింది అంటే?
డిసెంబర్ 28, ఆదివారం సాయంత్రం ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి తన భార్యకు తెలియకుండా ప్రియురాలితో కలిసి బహిరంగంగా తిరుగుతున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసిన తర్వాత ఆమె వెంటనే అక్కడికి చేరుకుంది.
అయితే పరిస్థితి ముదిరేలోపే భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. భర్త తప్పించుకోవడంతో ఆగ్రహం పెరిగిన భార్య, తన భర్తతో సంబంధం పెట్టుకున్న మహిళను పట్టుకుని నడి రోడ్డుపై చెంపలు వాయించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను చూసిన స్థానికులు ఒక్కసారిగా గుమిగూడారు.
వీడియో వైరల్.. పోలీసులు రంగంలోకి
ఈ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.
పోలీసులు అక్కడికి చేరుకునేలోపే స్థానికులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఇద్దరు మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కేసు నమోదు.. పరస్పర ఆరోపణలు
ఈ ఘటనలో తనపై దాడి జరిగిందంటూ ప్రియురాలు భార్యపై ఫిర్యాదు చేసింది. దీంతో భార్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు భార్య మాత్రం.. తన భర్త గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఆ కారణంగా తాను మానసికంగా వేధింపులకు గురయ్యానని ఆరోపిస్తోంది.
ఈ పరస్పర ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు. వైరల్ వీడియో ఆధారంగా, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
వివాహేతర సంబంధాలు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. క్షణిక ఆవేశంలో తీసుకున్న చర్యలు జీవితాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: Viral Video: వాడు నాకే సొంతం.. నడిరోడ్డుపై ఇద్దరు యువతుల రచ్చ.. అబ్బాయి కోసం ఫైట్
Cricket Viral: గ్రౌండ్‌లో క్యాచ్ పడితే.. బ్యాంక్‌లో కోట్లు! అదృష్టం అంటే ఈ కుర్రాడిదే!
