Astrology : కొత్త సంవత్సరంలో కుజ గ్రహం ఎక్కువకాలం బలంగా సంచరించబోతుండటంతో జ్యోతిష్యపరంగా కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఒకటి–రెండు నెలలు తప్పితే, మిగిలిన కాలమంతా కుజుడి ప్రభావం శక్తివంతంగా ఉండనుంది. దీనివల్ల అధికార యోగం, రాజకీయ ప్రాబల్యం, ఉన్నత ఉద్యోగాలు, స్థిరాస్తుల వృద్ధి, సంతాన ప్రాప్తి వంటి శుభ ఫలితాలు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రత్యేకంగా మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం రాశుల వారు ఈ ఏడాది కుజ గ్రహ అనుకూలతతో సంపద, ఉద్యోగ పురోగతి, ఆస్తి లాభాలను పొందే అవకాశముందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవ్వడం, సంతానం లేని వారికి సంతాన యోగం కలగడం కూడా ఈ ఏడాది ప్రత్యేకతగా నిలుస్తుంది.
మేషం
ఈ రాశికి రాశ్యధిపతిగా ఉన్న కుజుడు ఏప్రిల్, అక్టోబర్ నెలలు తప్ప మిగిలిన కాలమంతా బలంగా ఉండబోతున్నాడు. దీంతో ఉద్యోగం, వ్యాపారం, వృత్తుల్లో వేగంగా పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరగడంతో పాటు అధికార యోగం పట్టే అవకాశముంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. జనవరి మధ్య నుంచి డిసెంబర్ చివరి వరకు అనుకూలత కొనసాగుతుంది. గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.
కర్కాటకం
ఈ ఏడాది కర్కాటక రాశివారికి కుజ గ్రహం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారాల్లో విస్తరణ, ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. నిరుద్యోగులకు అనుకోని ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. భూమి, స్థిరాస్తుల ద్వారా లాభాలు పొందుతారు.
సింహం
సింహ రాశికి ఈ ఏడాది కుజుడు పూర్ణ అనుకూల గ్రహంగా మారతాడు. ప్రభుత్వ రంగం, అధికారిక హోదాలు, కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఆస్తి లాభాలు, పెట్టుబడుల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. వివాహ విషయాల్లో సంపన్న కుటుంబ సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. షేర్లు, పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.
వృశ్చికం
ఈ రాశికి అధిపతిగా ఉన్న కుజుడు ఏడాదిలో రెండు నెలలు మాత్రమే బలహీనంగా ఉంటాడు. మిగిలిన కాలమంతా వృశ్చిక రాశివారి జీవితం శుభఫలితాలతో సాగుతుంది. అనేకసార్లు ధనయోగం, రాజయోగం కలిగే అవకాశముంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారాలు వేగంగా విస్తరిస్తాయి.
ధనుస్సు
ధనుస్సు రాశివారికి కుజుడు సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉండబోతున్నాడు. విజయాలు, సాఫల్యాలు వరుసగా అందుతాయి. ఆస్తి వివాదాలు, న్యాయపరమైన సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. విదేశీ అవకాశాలు, పిత్రార్జిత లాభాలు దక్కే అవకాశం ఉంది.
మీనం
మీనం రాశికి ధన, భాగ్యాధిపతిగా ఉన్న కుజుడు ఈ ఏడాది విశేష అనుకూలతను ఇస్తాడు. ఉద్యోగంలో పదోన్నతులు, ఆదాయ వృద్ధి స్పష్టంగా కనిపిస్తాయి. విదేశీ సంపాదన యోగం బలంగా ఉంది. సొంత ఇల్లు, స్థిరాస్తులు సమకూరుతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా లాభాలు పొందుతారు. రాజకీయంగా ప్రాబల్యం పెరిగి, ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
మొత్తంగా కొత్త ఏడాది కుజ గ్రహ ప్రభావంతో ఈ ఆరు రాశుల వారికి శుభారంభాన్ని ఇస్తుందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి: Graham Walker : మానవత్వం అంటే మీదే బాస్! ఉద్యోగులకు రూ.2100 కోట్ల బోనస్.. హార్ట్ టచింగ్ కారణం ఇదే
Andhra Pradesh: గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇక యథేచ్ఛగా బయటకు వెళ్లొద్దు.. అధికారుల అనుమతి తప్పనిసరి
