Indian Railway: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని Indian Railways ఆధ్వర్యంలోని South Central Railway పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో ఈ స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు తెలిపింది.
సంక్రాంతి వస్తే చాలు హైదరాబాద్ నుంచి లక్షలాది మంది తమ స్వస్థలాలకు బయల్దేరుతారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. టికెట్లు దొరకక చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
📌 ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ (జనవరి 9 నుంచి 19 వరకు)
🔹 Secunderabad – Srikakulam (07288)
జనవరి 9 నుంచి 11 వరకు అందుబాటులో ఉంటుంది
సాయంత్రం 7:00 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి
మరుసటి రోజు మధ్యాహ్నం 12:30కి శ్రీకాకుళం చేరుకుంటుంది
తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3:30కి శ్రీకాకుళం నుంచి బయల్దేరి
మరుసటి రోజు ఉదయం 8:10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది
🔹 సికింద్రాబాద్ – శ్రీకాకుళం (07290)
ఈ రైలు టైమింగ్స్ కూడా 07288 రైలుతో సమానంగా ఉంటాయి
🔹 Vikarabad – శ్రీకాకుళం (07294)
సాయంత్రం 5:15 గంటలకు వికారాబాద్ నుంచి బయల్దేరి
మరుసటి రోజు మధ్యాహ్నం 12:30కి శ్రీకాకుళం చేరుకుంటుంది
తిరుగు ప్రయాణంలో 3:30కి శ్రీకాకుళం నుంచి బయల్దేరి
మరుసటి రోజు ఉదయం 8:10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది
🔹 సికింద్రాబాద్ – శ్రీకాకుళం (07292)
జనవరి 17న ప్రత్యేకంగా నడుస్తుంది
సాయంత్రం 7:00 గంటలకు బయల్దేరి
మరుసటి రోజు మధ్యాహ్నం 12:30కి శ్రీకాకుళం చేరుకుంటుంది
తిరుగు ప్రయాణంలో 3:30కి శ్రీకాకుళం నుంచి బయల్దేరి
మరుసటి రోజు ఉదయం 8:10కి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది
రైల్వేశాఖ ప్రకటించిన ఈ ప్రత్యేక రైళ్లతో సంక్రాంతి ప్రయాణ రద్దీ కొంత మేర తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: RRC Railway Jobs 2025: ఇంటర్ అర్హతతో సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు – రేపటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! తత్కాల్ టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధనలు – నేటి నుంచే అమల్లోకి
