HomeNationalTicket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! తత్కాల్ టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధనలు –...

Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! తత్కాల్ టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధనలు – నేటి నుంచే అమల్లోకి

Ticket Booking: డిసెంబర్ 1తో ప్రభుత్వ, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో పలు మార్పులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ఇండియన్ రైల్వేస్ కూడా తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో కీలక మార్పును అమలు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేందుకు ఉపయోగించే తత్కాల్ టికెట్ల కోసం ఇప్పుడు కొత్త రూల్స్ తప్పనిసరి కానున్నాయి.

తత్కాల్ టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధన – OTP వెరిఫికేషన్ తప్పనిసరి
ఇకపై తత్కాల్ సిస్టమ్ ద్వారా టికెట్ బుక్ చేయాలంటే
మొబైల్ నెంబర్ OTP వెరిఫికేషన్ తప్పనిసరి.
ప్రయాణికుడు నమోదు చేసిన మొబైల్ నెంబర్‌కు రైల్వే నుంచి OTP వస్తుంది.
OTP సరైన విధంగా ఎంటర్ చేసిన తర్వాతనే టికెట్ బుకింగ్ కొనసాగుతుంది.
OTP తప్పగా ఇస్తే టికెట్ కన్ఫర్మేషన్ కానే కాదు.
భద్రత పెంచడం, అక్రమాలను అడ్డుకోవడం, మోసపూరిత బుకింగ్‌లను నిలువరించడం లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఎవరికి ఈ రూల్స్ వర్తిస్తాయి?
కేవలం తత్కాల్ టికెట్ బుకింగ్‌లకే ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది.
సాధారణ రిజర్వేషన్ టికెట్లకు పాత విధానమే యథావిధిగా కొనసాగుతుంది.
IRCTC లాగిన్ ఉపయోగించి ఇతర అన్ని టికెట్లు మామూలుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

మార్పుల వెనుక ముఖ్య కారణం
రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,
కొంతమంది దళాల ద్వారా, బల్క్ లాగిన్‌ల ద్వారా, అనైతిక పద్ధతుల్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఇలాంటి మోసపూరిత బుకింగ్‌లను నివారించేందుకు
వాస్తవ ప్రయాణికులకే టికెట్లు అందేలా చేయడానికి
పారదర్శకత పెంచడానికి
ఈ OTP ఆధారిత వెరిఫికేషన్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు.
ఇకపై వెరిఫై అయిన యూజర్లు మాత్రమే తత్కాల్ టికెట్లు పొందగలరు.

అత్యవసర ప్రయాణాలకు ఉపయోగించే తత్కాల్ టికెట్లలో వచ్చే దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రతకు, సిస్టమ్ పారదర్శకతకు ఎంతో ఉపయోగపడనుంది.

ఇవీ చదవండి: APSRTC : RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఇకపై గూగుల్ మ్యాప్స్‌లోనే APSRTC బస్ టికెట్ బుకింగ్!
Railway Festive Offer : రైల్వే బంపర్ ఆఫర్.. టికెట్ రిజర్వేషన్‌పై 20% తగ్గింపు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు