Watch Video: రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్‌పై ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సదరు ఎమ్మెల్యే ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆదివారం (డిసెంబర్ 21) ముంబైలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది.
అసలేం జరిగిందంటే…
ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండటంతో, ఈ రూట్‌లో Bharatiya Janata Party ఎమ్మెల్యే Parag Shah స్థానికులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసన కారణంగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ సమయంలో ఓ ఆటో డ్రైవర్ రాంగ్ రూట్‌లో దూసుకెళ్లడాన్ని ఎమ్మెల్యే గమనించారు.
దీంతో ఆటో డ్రైవర్‌ను ఆపి నిలదీయగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం ముదిరిన క్రమంలో, అక్కడున్న వారందరి ముందే ఎమ్మెల్యే పరాగ్ షా ఆటో డ్రైవర్ చెంపపై లాగిపెట్టి కొట్టారు. చుట్టూ పెద్ద సంఖ్యలో జనం గుమికూడటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే పరాగ్ షా, తాను చేయి చేసుకున్న విషయాన్ని అంగీకరించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా వాహనం నడిపాడని, పదే పదే హెచ్చరికలు చేసినా పట్టించుకోకపోవడంతో కోపంలో అలా జరిగిందని చెప్పారు. రాంగ్ రూట్‌లో అధిక వేగంతో వస్తున్న ఆటోను ఆపేందుకు సిగ్నల్ ఇచ్చినా వినలేదని వివరించారు. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ కూడా డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌పై ఫిర్యాదు చేసిందని ఆయన పేర్కొన్నారు.
అయితే, డ్రైవర్‌పై చేయి చేసుకోవడం తప్పేనని అంగీకరించిన ఎమ్మెల్యే, చివరికి ఆటో డ్రైవర్‌కు చలాన్ విధించి హెచ్చరికతో వదిలిపెట్టామని తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే, ట్రాఫిక్ నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
ఇవీ చదవండి: BJP Neta Video : మధ్యప్రదేశ్‌లో రోడ్డుపైనే బీజేపీ నేత శృంగారం.. వీడియో వైరల్
AP BJP List: ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు రిలీజ్.. నరసాపురం తప్ప అన్ని సీట్లూ వలస నేతలకే!
