Career Astrology: కొత్త సంవత్సరం 2026లో ఉద్యోగ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కుజ, రవి, శుక్ర, గురు వంటి ఉద్యోగ కారక గ్రహాలు సంవత్సరం ప్రథమార్థంలో స్థిర, ద్విస్వభావ రాశుల నుంచి చర రాశులలోకి సంచారం చేయనున్నాయి. ఈ గ్రహచలనాల ప్రభావంతో కొంతమంది రాశుల వారికి ఉద్యోగ మార్పు, బదిలీలు, స్థాన చలనం, పదోన్నతులు తప్పనిసరిగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
ప్రత్యేకంగా ఫిబ్రవరి నుంచి జూలై 2026 మధ్య ఈ మార్పులు ఎక్కువగా కనిపించనున్నాయి.
ఈ రాశుల వారికి మార్పులు ఎక్కువ
మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం
మేషం
రాశ్యధిపతి కుజుడు జనవరి–ఫిబ్రవరి నెలల్లో మకర రాశిలో సంచారం చేయడం వల్ల ఉద్యోగ మార్పు ఖాయం. ఉన్నత హోదా, మంచి జీతభత్యాలు లభించే అవకాశం ఉంది. పదోన్నతి, బదిలీ సూచనలు స్పష్టంగా ఉన్నాయి. కొద్దిపాటి ప్రయత్నంతో విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, వృత్తుల్లో చిన్న మార్పులతో డిమాండ్ పెరుగుతుంది.
కర్కాటకం
కుజ, రవులు చర రాశుల్లోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగ మార్పులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఫిబ్రవరి లోపు మార్పు రాకపోతే, మే తర్వాత గురు ప్రవేశంతో కొత్త ఉద్యోగ అవకాశాలు బలపడతాయి. దూర ప్రాంత సంస్థలో మంచి ఆఫర్, బదిలీలు, విదేశీ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
కన్య
మే తర్వాత గురు లాభస్థానంలో ఉచ్ఛస్థితి పొందడంతో ఉన్నత పదవి, భారీ వేతనాల కోసం ఉద్యోగ మార్పు జరుగుతుంది. జనవరి–ఫిబ్రవరిలో బుధుని అనుకూల సంచారం వల్ల అనుకున్న లక్ష్యాలు సాధ్యమవుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.
తుల
దశమస్థానంలో ఉచ్ఛ గురు ప్రభావంతో కెరీర్‌లో శుభపరిణామాలు ఎక్కువ. ఉద్యోగ మార్పు, పదోన్నతి, జీతభత్యాల పెరుగుదల సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు, విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. బదిలీలు లేదా స్థాన చలనాలు సంభవించవచ్చు.
ధనుస్సు
రాశ్యధిపతి గురు చర రాశిలో ఉచ్ఛస్థితి వల్ల ఉద్యోగ మార్పు, స్థాన చలనం బలంగా కనిపిస్తోంది. విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు రావచ్చు. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. మే తర్వాత ఒకే ఉద్యోగం లేదా ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండడం కష్టం కావచ్చు.
మకరం
సప్తమస్థానంలో గురు ఉచ్ఛపడడం వల్ల మే తర్వాత తప్పనిసరిగా ఉద్యోగ మార్పు జరిగే అవకాశం. మెరుగైన హోదా, కొత్త బాధ్యతలు, జీతభత్యాల పెరుగుదల కనిపిస్తోంది. విదేశీ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం దొరికే సూచనలు ఉన్నాయి.
ఇవీ చదవండి: Lucky Zodiac Signs: ధనూ రాశికి గ్రహ బలం.. ఈ రాశుల వారికి లక్ గ్యారెంటీ!
2026 Tula Rasi : 2026 తులా రాశి ఫలితాలు: ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం మరియు సంవత్సరపు పూర్తి జ్యోతిష్య ఫలాలు
