HomeNationalHaseen Mastan : న్యాయం కోసం అండర్‌వరల్డ్ మాజీ డాన్ కూతురి పోరాటం.. ప్రధాని మోదీ,...

Haseen Mastan : న్యాయం కోసం అండర్‌వరల్డ్ మాజీ డాన్ కూతురి పోరాటం.. ప్రధాని మోదీ, అమిత్ షాలకు విజ్ఞప్తి

Haseen Mastan : ముంబై అండర్‌వరల్డ్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన హాజీ మస్తాన్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే ఈసారి ఆయన గత కార్యకలాపాల వల్ల కాదు… ఆయన కుమార్తె హసీన్ మస్తాన్ మీర్జా ఆవేదనభరిత విజ్ఞప్తి కారణంగా. తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన అనుభవాలను వెల్లడిస్తూ హసీన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

1994లో తండ్రి మరణం అనంతరం తన జీవితం నరకప్రాయంగా మారిందని హసీన్ చెబుతోంది. సొంత కుటుంబమే తనను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించింది. 1996లో తాను మైనర్‌గా ఉన్న సమయంలోనే ఆస్తి కోసమే తన మేనమామ కుమారుడితో బలవంతంగా వివాహం జరిపించారని పేర్కొంది. ఆ పెళ్లి అనంతరం తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నానని, ప్రాణహాని కూడా ఎదురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన మాజీ భర్తకు అప్పటికే పలువురు భార్యలు ఉన్నారని కూడా చెప్పింది.

ఈ వేధింపులను తట్టుకోలేక మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు హసీన్ వెల్లడించింది. సహాయం కోసం పోలీసులను ఆశ్రయించినప్పుడు, తన సమస్యలపై దృష్టి పెట్టకుండా తండ్రి గతానికి సంబంధించిన ప్రశ్నలే వేసేవారని ఆరోపించింది. దీంతో తాను మరింత ఒంటరిగా మిగిలిపోయానని తెలిపింది.

ఇప్పుడు తన తండ్రి ఆస్తిలో తనకు చట్టబద్ధమైన వాటా కల్పించాలని, తనపై వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని హసీన్ డిమాండ్ చేస్తోంది. ఏళ్లుగా సాగుతున్న తన పోరాటానికి న్యాయం చేయాలని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఆమె విజ్ఞప్తి చేసింది. ఇది తన వ్యక్తిగత న్యాయపోరాటమే తప్ప, తండ్రి గతంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

తనలాంటి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలని హసీన్ కోరింది. ఆమె ఆరోపణలు సంచలనం రేపడంతో, ఈ అంశంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

ఇవీ చదవండి: Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష.. విదేశంలో ఉన్నప్పటికీ చరిత్రలో ముద్ర వేసిన తీర్పు
No Handshake Policy : ఐసీసీ విజ్ఞప్తిని పట్టించుకోని భారత్.. భారత్–పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో హ్యాండ్‌షేక్ పాలసీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు