HomeAndhra PradeshAndhra News: ఏపీ ప్రజలకు శుభవార్త.. సూర్యఘర్ యోజనపై ప్రభుత్వం కీలక ప్రకటన

Andhra News: ఏపీ ప్రజలకు శుభవార్త.. సూర్యఘర్ యోజనపై ప్రభుత్వం కీలక ప్రకటన

Andhra News: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ యోజన (PM Surya Ghar Muft Bijli Yojana) పథకాన్ని రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తిగా ఉచితంగా అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక బీసీ వర్గాలకు భారీ రాయితీ అందించనున్నట్లు స్పష్టం చేసింది.

ఈ పథకం ద్వారా ఇంటి పైకప్పుపై తక్కువ ఖర్చుతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని, అవసరమైన విద్యుత్‌ను స్వయంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద భారీ సబ్సిడీతో పాటు బ్యాంకు రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.

మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటన
ఇటీవల విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు సూర్యఘర్ యోజనను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచితం
ఈ పథకం కింద:
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు పూర్తిగా ఉచితం
బీసీ వర్గాలకు భారీ రాయితీ
కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా గ్రామ/వార్డు సచివాలయాలను సందర్శించి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా కోటిమంది లబ్ధిదారులను లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అమలు చేస్తోందని వెల్లడించారు.

రాయితీ ఎలా లభిస్తుంది?
సూర్యఘర్ యోజన కింద మీ ఇంటిపై సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఉదాహరణకు:
3 కిలోవాట్ల సౌర ప్లాంట్ ఏర్పాటు ఖర్చు సుమారు రూ.1.50 లక్షలు అయితే
ఇందులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీగా రూ.70 వేల వరకు లభిస్తుంది
మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు చెల్లించాలి

దీనికోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో అప్లికేషన్ చేసుకుంటే అధికారులు పరిశీలించి అనుమతి ఇస్తారు. అనంతరం కొత్త మీటర్ ఏర్పాటు చేసి, సౌర విద్యుత్ ద్వారా ఉచిత కరెంట్ వినియోగించుకోవచ్చు.

సూర్యఘర్ యోజన ద్వారా ఏపీ ప్రజలకు విద్యుత్ ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణహితమైన విద్యుత్ వినియోగానికి కూడా బాటలు వేస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా ఈ పథకం అమలు కావడం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి: PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి.. డబ్బు వచ్చిందో లేదో ఇలా చెక్‌ చేసుకోండి..
PM SVANidhi: చిరు వ్యాపారులకు భారీ గుడ్‌న్యూస్ – పూచీకత్తు లేకుండా ₹90,000 వరకు రుణం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు