Akhanda 2 Viral Video: నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2’ థియేటర్లలో సంచలనాన్ని సృష్టిస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
డే 1నే ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.59 కోట్ల కలెక్షన్లు సాధించిన ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతున్న ఈ సినిమా, బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా మారడంతో థియేటర్ల వద్ద జనాలు క్యూ కడుతున్నారు.
భక్తి, ఆధ్యాత్మికతతో నిండిన అనుభూతి
‘అఖండ 2’ చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు భక్తి, ఆధ్యాత్మికతతో నిండిన అనుభూతి కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలయ్య అఘోర అవతారంలో కనిపించే సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్, థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఈ సినిమాపై పలు హిందూ సంఘాలు, స్వామీజీలు కూడా ప్రశంసలు కురిపించడం విశేషం.
థియేటర్లలో పూనకాల హంగామా
స్క్రీన్‌పై బాలయ్య కనిపించగానే అభిమానులు లేచి నిలబడి విజిల్స్, చప్పట్లతో థియేటర్లను దద్దరిల్లిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌కి దగ్గరయ్యే కొద్దీ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే శివ స్తోత్రాలు ప్రేక్షకులను పూర్తిగా ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తున్నాయి.
ఇదిలా ఉండగా, తాజాగా ఓ థియేటర్‌లో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ థియేటర్‌లో ‘అఖండ 2’ క్లైమాక్స్ చూస్తున్న ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది.
క్లైమాక్స్ సీన్‌లో మహిళకు పూనకం
క్లైమాక్స్‌లో శివుడు తాండవం చేసే సన్నివేశాన్ని చూస్తూ ఆ మహిళ చేతులు ఊపుతూ, శరీరం కంపిస్తూ, శివుడికి దండం పెట్టినట్లు కనిపించింది. పూర్తిగా ఆ సన్నివేశంలో లీనమైపోయిన ఆమె పూనకంతో ఊగిపోతుండటంతో పక్కనే ఉన్న ఆమె భర్త ఆమెను అదుపు చేసే ప్రయత్నం చేశాడు.
ఈ ఘటనను చూసిన థియేటర్‌లోని ప్రేక్షకులు ఆశ్చర్యంతో ఆమెవైపు చూడగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ చర్చకు తెరలేపుతున్నారు.
ఇవీ చదవండి: Akhanda 2 Movie Review : అఖండ 2: తాండవం – రివ్యూ: బాలయ్య రుద్రతాండవం, మాస్ మహా పండగ!
Akhanda 2 : అఖండ 2: డిసెంబర్ 12 విడుదల.. ఎందుకు వాయిదా పడింది? పూర్తి పరిణామాలివీ
Akhanda 2: విడుదలపై ఆగని చర్చ… తీవ్రమైన ప్రయత్నాల్లో టీమ్ – మేకర్స్ తాజా ప్రకటన
