HomeCinemaAnupam Kher : 9 లక్షల ఫాలోవర్లు మాయమ్… మస్క్‌కి నేరుగా కంప్లయింట్ చేసిన బాలీవుడ్...

Anupam Kher : 9 లక్షల ఫాలోవర్లు మాయమ్… మస్క్‌కి నేరుగా కంప్లయింట్ చేసిన బాలీవుడ్ సీనియర్! అసలు విషయం ఏమిటి?

Anupam Kher : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇటీవల ఊహించని సమస్యను ఎదుర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ X (పూర్వం ట్విట్టర్) లో ఆయన ఖాతాలో పెద్ద ఎత్తున ఫాలోవర్లు కరిగిపోయినట్లు తెలిసి షాక్ అయ్యారు.

వేలల్లో కాదు… కేవలం 15 రోజుల్లోనే ఏకంగా 9 లక్షలకు పైగా ఫాలోవర్లు మాయం కావడం ఆయనను ఆందోళనకు గురి చేసింది. వెంటనే దీనిపై స్పందించిన అనుపమ్ ఖేర్… నేరుగా X CEO ఎలన్ మస్క్‌కే ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన బాలీవుడ్ వర్గాల్లోనే కాక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లన్నింటిలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

“ఇది ఫిర్యాదు కాదు… గమనిక మాత్రమే!” — అనుపమ్ ఖేర్
తన ఖాతాలో చోటుచేసుకున్న ఈ అసాధారణ మార్పుపై అనుపమ్ ఖేర్ ఇలా ట్వీట్ చేశారు:

“Dear Mr. Elon Musk, గత 15 రోజుల్లో నా అకౌంట్‌లో 9,00,000 ఫాలోవర్లు తగ్గిపోయారు. దీనికి కారణం ఏమిటో మీకు లేదా మీ టీమ్‌లోని ఎవరికి తెలుసా? ఇది ఇంకా కంప్లయింట్ కాదు… కేవలం గమనిక మాత్రమే!”

ఆయన ఇలా పేర్కొన్నప్పటికీ, ఒక ప్రముఖ నటుడు ఇలా పెద్ద మొత్తంలో ఫాలోవర్లను కోల్పోవడం సాధారణ విషయం కాదనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇది టెక్నికల్ ఇష్యూనా? లేక బాట్ అకౌంట్స్ క్లీనప్లో భాగంగా జరిగిన మార్పా? అన్న ప్రశ్నలు నెట్టింట్లో చర్చనీయాంశమయ్యాయి.

తెలుగు ప్రేక్షకులకూ అనుపమ్ ఖేర్ సుపరిచితమే
500కిపైగా సినిమాల్లో నటించిన ఈ సీనియర్ ఆర్టిస్ట్ ఇటీవల ‘కార్తికేయ 2’, ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలాంటి వ్యక్తి అకౌంట్‌లో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు మాయం కావడం పెద్ద టెక్నికల్ గ్లిచ్‌గా చూస్తున్నారు.

ఇప్పుడు అందరి దృష్టి ఎలన్ మస్క్ లేదా X టెక్నికల్ టీమ్ స్పందనపైనే నిలిచింది. అసలు కారణం ఏమిటి? అనేది బయటకు వచ్చేదేమిటో చూడాలి.

ఇవీ చదవండి: Kantara Chapter 1 : 5 రోజుల్లో బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్.. కాంతార సరికొత్త రికార్డులు
Hit Movies : 25 కోట్లతో తీసిన సినిమా.. 340 కోట్ల వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు