HomeAndhra PradeshYS Jagan PC : రేపు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై క్లారిటీ!

YS Jagan PC : రేపు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై క్లారిటీ!

YS Jagan PC : రేపు (04.12.2025, గురువారం) వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై మీడియాతో జగన్‌ మాట్లాడనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

మోంథా తుపాను నేపథ్యంలో రైతుల కష్టాలను జగన్ స్వయంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికే వైఎస్సార్ సీపీ మండిపడుతోంది. అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని, సీఎం చంద్రబాబు అన్నదాతలను వంచిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు మద్దతుగా జగన్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఇటీవలి కాలంలో వరుస పరిణామాలు, తిరుమల లడ్డూ వ్యవహారం, తదితర అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడే చాన్స్ ఉందని సమాచారం.

ఇవీ చదవండి: YS Jagan : చంద్రబాబూ.. ఇకనైనా రైతులను పట్టించుకోండి: వైఎస్ జగన్‌
YS Jagan : పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్.. తరలివచ్చిన జనం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు