HomeBusinessRecharge Plan: రూ.1కే ఒక నెల ఫ్రీ! మార్కెట్‌ను షేక్ చేస్తున్న BSNL సూపర్ ఆఫర్

Recharge Plan: రూ.1కే ఒక నెల ఫ్రీ! మార్కెట్‌ను షేక్ చేస్తున్న BSNL సూపర్ ఆఫర్

Recharge Plan: భారతీయ టెలికాం రంగంలో ఎయిర్‌టెల్, జియో ఆధిపత్యం కొనసాగుతూనే ఉన్నా, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తిరిగి పోటీలో నిలబడేందుకు దూకుడు పెంచింది. టవర్ల విస్తరణ, నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌లో ఆలస్యం కారణంగా కోల్పోయిన కస్టమర్ బేస్‌ను తిరిగి సాధించేందుకు కంపెనీ వరుస ఆఫర్లు విడుదల చేస్తోంది. ముఖ్యంగా తక్కువ ధరకు మంచి సర్వీస్ కావాలనుకునే వినియోగదారులు మళ్లీ బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళుతున్నారు. 5జీ నెట్‌వర్క్ కూడా త్వరలో అందుబాటులోకి రానుండటంతో దాని డిమాండ్ మరింత పెరిగింది.

₹1 Freedom Plan – సూపర్ బంపర్ ఆఫర్!
కొత్త సిమ్ తీసుకునే కస్టమర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి అద్భుతమైన ఆఫర్‌ను ప్రారంభించింది. గతంలో స్వాతంత్ర్య దినోత్సవం, దీపావళి సందర్భంగా లాంచ్ చేసిన ఈ ₹1 Freedom Plan ను డిసెంబర్‌లో తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ ఆఫర్‌లో ఏముంది?
కొత్త సిమ్ ఉచితం
కేవలం ₹1కే ఒక నెల రీఛార్జ్
అన్‌లిమిటెడ్ కాల్స్
రోజుకు 2GB డేటా
రోజుకు 100 SMSలు
ఆఫర్ వ్యవధి: డిసెంబర్ 1 నుండి 31 వరకు

అత్యల్ప ధరకు సాలిడ్ బెనిఫిట్స్ కావడంతో చాలామంది ఈ ప్లాన్‌ను సెలెక్ట్ చేయడంతో, BSNL ఇది మళ్లీ ప్రారంభించినట్లు తన అధికారిక X (Twitter) అకౌంట్‌లో ప్రకటించింది.

₹199 ప్లాన్ – మరో విలువైన ఆప్షన్
ఇటీవలి కాలంలో BSNL ప్రకటించిన మరో ప్రధాన ప్లాన్ ₹199 రీఛార్జ్ ప్లాన్.
ఈ ప్లాన్ బెనిఫిట్స్:
వ్యాలిడిటీ: 28 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్
రోజుకు 2GB డేటా
రోజుకు 100 SMSలు
తక్కువ ధరలో స్టాండర్డ్ నెలవారీ అవసరాలను మేనేజ్ చేసుకునే ప్లాన్‌గా ఇది మంచి ఫిట్.

మొత్తానికి…
బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లను తిరిగి సంపాదించుకునే యత్నంలో భాగంగా అత్యంత తక్కువ ధరలో మిగతా కంపెనీలను ఎదుర్కొనేలా సూపర్ ఆఫర్లు ఇస్తోంది. ముఖ్యంగా ₹1 ప్లాన్ కొత్త వినియోగదారులకు నిజంగా పెద్ద బెనిఫిట్‌గా మారుతోంది.

ఇవీ చదవండి: BSNL: డైరెక్ట్-టు-డివైస్ శాటిలైట్ కనెక్టివిటీని ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
BSNL Offers: బీఎస్ఎన్ఎల్ బొనాన్జా.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా ఓటీటీ ఆఫర్లు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు