Hyderabad: ఈ మధ్య కాలంలో ‘ఈజీ మనీ’ కోరిక ప్రమాదకరంగా పెరుగుతోంది. ఇంట్లో కూర్చుని ఫోన్‌లో ఒక్క రెండు క్లిక్స్ చేస్తే డబ్బులు రావాలి… లేదా కష్టపడి పనిచేయకుండా ఏదో షార్ట్‌కట్‌లో డబ్బు సంపాదించాలనే ఆలోచన చాలా మందిని అడ్డదారులకు నెడుతోంది. ఈ తత్వం వల్ల ఎన్నో రకాల మోసాలు, విచిత్ర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటిదే మరో సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో స్థానికులకు కొన్ని అనుమానాస్పద కదలికలు కనిపించాయి. టార్చ్‌లైట్లు, పూజా సామగ్రి, తవ్వే పరికరాలు… అన్నీ కలిపి అక్కడ ఏదో రహస్య పూజ లేదా కార్యక్రమం జరుగుతున్నట్టే అనిపించింది. వెంటనే ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది.
సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకుని పరిశీలించగా భారీగా తవ్వబడిన గుంత, పగిలిన కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించాయి. మొదట్లో అక్కడ ఉన్న ఎనిమిదిమంది ఎటువంటి సమాచారం చెప్పకపోయినా… కాస్త గట్టిగా ప్రశ్నించగానే అసలు విషయాన్ని ఒప్పుకున్నారు.
వారి ప్లాన్ అసలు ఏంటంటే?
గుప్త నిధులు దొరుకుతాయనే నమ్మకంతో రాత్రివేళ తవ్వకాలు జరిపారు! పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని, అక్కడున్న ఒక కారు, రెండు బైకులు, పూజా వస్తువులు, తవ్వే సామగ్రి, ఎనిమిది మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.
ఈ సంఘటనకొద్ది రోజుల క్రితమే వరంగల్, ములుగు జిల్లాల్లో జరిగిన మరో కేసును గుర్తు చేసింది. అక్కడ కూడా ఒక ఆటో డ్రైవర్ మహారాష్ట్రలో తవ్వకాలు చేసి రాగి బిందె దొరికిందని, అందులో బంగారు నాణేలు ఉన్నాయంటూ గుట్టుగా పంచుకునే ప్లాన్ వేసాడు. పంపకాల విషయంలో గొడవ పెరిగి… చివరకు పోలీసుల వరకు విషయం చేరింది.
ఈజీగా వచ్చే డబ్బు కేవలం కథల్లో మాత్రమే ఉంటుంది. నిజ జీవితంలో షార్ట్‌కట్లు ఎక్కువగా పోలీస్ స్టేషన్‌కే తీసుకెళ్తాయి.
ఇవీ చదవండి: Infosys : ఆ మహిళలకు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. రిఫర్ చేస్తే
Infosys: ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డింగ్‌లో భారీ సంస్కరణ
