Canada News : కొంతమంది విదేశాలకు వెళ్లి అక్కడ చేష్టలతో మన దేశానికే చెడ్డ పేరు తెచ్చే ఘటనలు తరచూ బయటకు వస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటన కెనడాలో చోటుచేసుకుంది. ఆరు నెలల విజిటర్ వీసాతో కెనడాకు వెళ్లిన 51 ఏళ్ల భారతీయుడు, ఓ స్కూల్ సమీపంలో టీనేజ్ బాలికలను వేధించినట్టు ఆరోపణలు రావడంతో కోర్టు అతనిపై కఠిన చర్యలు తీసుకుంది. చివరకు కెనడా ప్రభుత్వం అతన్ని దేశం నుండి బహిష్కరించే నిర్ణయం తీసుకుంది.
కెనడాలో భారతీయుడి ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు
పోలీసుల ప్రకారం, సింగ్ అనే వ్యక్తి ఒంటారియోలోని సర్నియా ప్రాంతంలో తన మనవడి వద్దకు వెళ్లి నివసిస్తున్నాడు. అక్కడి స్థానిక హైరీస్కూల్ పక్కనున్న ఒక దుకాణం దగ్గర తరచూ సిగరెట్ కాల్చుతూ ఉండేవాడు.
ఈ సమయంలో:
అక్కడుగా వెళ్లే టీనేజ్ బాలికలు, యువతుల వెంటేపడటం
వారిని ఫోటోలు తీయడానికి ప్రయత్నించడం
వారి తోపాటు డ్రగ్స్, మద్యం గురించి అనుచితంగా మాట్లాడడం
వంటి ఆరోపణలు అతనిపై వచ్చాయి. స్థానిక మీడియా ఈ వివరాలను వెల్లడించడంతో విషయం మరింత సీరియస్‌గా మారింది.
అరెస్టులు – బెయిల్ – మళ్లీ అరెస్ట్
ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 16న పోలీసులు అతన్ని లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేశారు.
కానీ రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన సింగ్‌ను అదే రోజు మరోసారి అరెస్టు చేశారు. పునరావృత ప్రవర్తన పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
కోర్టు తీర్పు – ‘ఇలాంటి ప్రవర్తనకు కెనడాలో స్థానం లేదు’
సింగ్‌ను కోర్టులో హాజరుపరచగా, జస్టిస్ క్రిస్టా లిన్ లెస్జ్జిన్స్కీ అతని ప్రవర్తన పూర్తిగా అంగీకరించలేనిదని స్పష్టం చేశారు.
సింగ్ న్యాయవాది డిసెంబర్ 30న భారత్‌కు తిరిగివెళ్ళే టికెట్ ఉందని తెలిపినా, కోర్టు దీనిని పరిగణనలోకి తీసుకోలేదు.
కోర్టు ఆదేశాలు:
సింగ్‌ను వెంటనే కెనడా నుంచి బహిష్కరించాలి
భవిష్యత్తులో అతను కెనడాలోకి తిరిగి ప్రవేశించడాన్ని నిషేధించాలి. అని స్పష్టంగా పేర్కొంది.
ఇవీ చదవండి: Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష.. విదేశంలో ఉన్నప్పటికీ చరిత్రలో ముద్ర వేసిన తీర్పు
Death Penalty : ఆ దేశంలో విదేశీ షోలు చూసినా, షేర్ చేసినా మరణశిక్షే!
