HomeTelanganaKokapet Lands : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హాట్‌కేక్‌… కోకాపేట భూములకు మళ్లీ రికార్డ్ ధర!...

Kokapet Lands : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హాట్‌కేక్‌… కోకాపేట భూములకు మళ్లీ రికార్డ్ ధర! ఎకరం ఎంతంటే?

Kokapet Lands : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేడి మరోసారి స్పష్టమైంది. తాజాగా కోకాపేట నియోపోలిస్‌లో జరిగిన HMDA భూ వేలం రికార్డ్ స్థాయి ధరలను నమోదు చేసింది. ఇటీవల రాయదుర్గంలో ఎకరం భూమి భారీ మొత్తానికి అమ్ముడయ్యినా, కోకాపేట వేలం ఆ రికార్డులను దాటేసింది.

శనివారం నిర్వహించిన ఈ వేలంలో సర్వే నంబర్లు 17, 18లోని భూములు బరిలోకొచ్చాయి. కనీస ధరగా ఎకరానికి ₹99 కోట్లు నిర్ణయించినా, బిడ్డింగ్ వేడిగా సాగడంతో సర్వే నెంబర్ 17లోని భూమి ఎకరానికి అట్టహాసంగా ₹137.25 కోట్లు పలికింది. ఇది ప్రస్తుతం హైదరాబాద్‌లో నమోదైన అత్యధిక ధరల్లో ఒకటి.

వివరాలు చూస్తే—
ప్లాట్ నెం. 17: 4.59 ఎకరాలు
ప్లాట్ నెం. 18: 5.31 ఎకరాలు
మొత్తం 9.90 ఎకరాల వేలం ద్వారా HMDAకు ₹1,355.33 కోట్లు ఆదాయం లభించింది.

నియోపోలిస్‌కి సమీపంలోని ఈ భూభాగం ఐటీ కారిడార్‌కి దగ్గరగా ఉండడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగంగా అభివృద్ధి చెందడం వంటి అంశాలు ధరలపై ప్రధానంగా ప్రభావం చూపాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రాఫ్ ఎటూ తగ్గేలా కనిపించడంలేదు!

ఇవీ చదవండి: Ursa : భూములు కొట్టేసే కుట్రలో భాగంగానే ‘ఉర్సా’ ఆవిర్భావం
Kakinada SEZ: మార్కెట్‌ రేటు కంటే ఎక్కువకే సెజ్‌లో భూములు కొన్నాను

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు