IND vs SA 2nd Test: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో అవమానకర ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా, ఇప్పుడు గౌహతిలో నవంబర్ 22 నుంచి జరగనున్న రెండో టెస్టుపై దృష్టి సారిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత
మొదటి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మ్యాచ్ మిగతా భాగంలో కూడా అతను మైదానంలోకి రాలేదు. అతని ఆరోగ్య పరిస్థితిని ఇంకా పరిశీలిస్తున్నామని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు. గిల్ అందుబాటులో లేకపోతే అది బ్యాటింగ్ లైన్‌అప్‌కు పెద్ద దెబ్బ కానుంది.
తెలుగబ్బాయి నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం?
శుభ్‌మన్ గిల్ బ్యాకప్‌గా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను గౌహతిలో జట్టుతో కలిసి సాధన చేస్తున్నాడు. గిల్ ప్లేయింగ్ XI నుండి తప్పుకుంటే, నితీష్‌కు డెబ్యూ చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది.
అక్షర్ పటేల్ స్థానంలో అదనపు బ్యాట్స్‌మన్?
ఈ మ్యాచ్‌లో మరొక కీలక మార్పు ఉండొచ్చు. కోల్‌కతా టెస్టులో స్పెషల్‌గా ప్రభావం చూపలేకపోయిన అక్షర్ పటేల్ స్థానంలో అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడించే అవకాశాన్ని జట్టు పరిశీలిస్తోంది. సాయి సుదర్శన్ లేదా దేవదత్ పడిక్కల్‌లో ఎవరికైనా అవకాశం దక్కే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్ గత మ్యాచ్‌లో నంబర్ 3 లో ఆడగా, ఈ మ్యాచ్‌లో అతను మిడ్ ఆర్డర్‌కు మార్చబడే అవకాశం ఉంది.
గౌహతి టెస్ట్ – భారత జట్టు సంభావ్య ప్లేయింగ్ XI
కేఎల్ రాహుల్
యశస్వి జైస్వాల్
సాయి సుదర్శన్ / దేవదత్ పడిక్కల్
శుభ్‌మన్ గిల్ / నితీష్ కుమార్ రెడ్డి
రిషబ్ పంత్
ధ్రువ్ జురెల్
రవీంద్ర జడేజా
వాషింగ్టన్ సుందర్
కుల్దీప్ యాదవ్
జస్ప్రీత్ బుమ్రా
మహ్మద్ సిరాజ్
టీమిండియా ఈ మ్యాచ్‌లో సమరంగంలోకి ఆత్మవిశ్వాసంతో దిగాలంటే బ్యాటింగ్‌లో పెద్ద మార్పులు తప్పనిసరిగా అవసరం కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: KKR Captain: షారుఖ్ ఖాన్ సర్ప్రైజ్ ప్లాన్.. కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా టీమిండియా స్టార్ బౌలర్?
Kolkata Test : కోల్‌కతా టెస్ట్‌లో భారత్‌కు ఝలక్.. 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం
