Cotton Farmers : ఆంధ్రప్రదేశ్‌లో పలు సమస్య ల మధ్య పత్తి సాగుచేసి రైతులు ఆర్థికంగా తీవ్ర ప్రమాదంలో ఉన్నారు. రైతులు తమ ఫలితాన్ని తగిన ధరకి విక్రయించలేక, భారీ నష్టం చెందుతున్నారు. ఈ పరిస్థితిని ప్రభుత్వ యంత్రాంగం పట్టించు కోక పోవడం గ్రామీణ జీవనానికి తీవ్ర ముప్పను ఏర్పరుస్తుంది.
* అతివృష్టితో దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులకు ఆర్థిక సంక్షోభం
* వ్యవసాయ కార్మికులకు పని తగ్గి కర్నూలు జిల్లా నుండి వలసలు మొదలు
* కొనుగోలు కేంద్రాలు ఆలస్యం, నాణ్యత సమస్యలు, దిగుమతుల ఒత్తిడి
ముఖ్య అంశాలు
ఈ సీజన్‌లో రాష్ట్రం లో పత్తి సాగు విస్తీర్ణం సుమారు 4.48 లక్ష హెక్టార్లు గా ఉంది. ఇందులో అత్యధికం గా ఒక్క కర్నూల్ జిల్లాలోనే 2.26 లక్షల హెక్టర్ లు, పల్నాడు జిల్లా లో 87 వేల హెక్టర్లు, NTR జిల్లాలో 33 వేల హెక్టర్లు, అనంతపురం జిల్లా లో 26 వేల హెక్టర్లు, గుంటూరు జిల్లా లో 22 వేల హెక్టర్లు, ప్రకాశం జిల్లలో 18 వేల హెక్టర్లు..
CCI కొనుగోలు కేంద్రాల ఆలశ్య ప్రారంభం, తేమ నిబంధనలు కఠినంగా ఉండడం, నాణ్యత ప్రమాణాలు చేరలేదు అనే నెపం తో రైతుల దగ్గర భారీ నష్టాలు కలిగిస్తున్నాయి.
రైతులు క్వింటాలు 4,000–7,200 రూపాయల మధ్య న తమ పత్తిని అమ్మాల్సి వస్తున్నది, సరాసరిన 5,000 నుండి 6,000 రూపాయలు మాత్రమే రైతుకు వస్తున్నది. ఇది ప్రభుత్వం నిర్ణయించిన MSP 8110 రూపాయల కంటే చాలా తక్కువ..
తేమ 12% పైగా ఉంది అనే నెపం తో పత్తి తక్కువ ధరకు కొనుగోలు చేయబడుతున్నది. రైతులకు తగిన ఏర్పాట్లు లేకపోవటం ఇది ఒక పెద్ద సమస్యగా మారింది..
దిగుమతులపై రుసుముల తొలగింపు నిర్ణయం ద్వారా విదేశీ పత్తి ప్రవేశం పెరిగే అవకాశం — స్థానిక రైతుల ధరలపై ప్రతికూల ప్రభావం..
డిమాండ్లు & సూచనలు
1. వెంటనే ప్రతి కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలి..
రైతులకు కనీస మద్దత్తు ధర లభించేలా చూడాలి..
2. CCI తేమ పరిమితిని సడలించాలి (ఉదా: వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని)..
3. నాణ్యత ప్రమాణాలు సాధ్యమైన విధంగా సరళీకృతమైన ప్రమాణాలకు మార్చాలి..
4. దిగుమతులపై రుసుముల విధానాన్ని తిరిగి పునరాలోచించాలి — దేశీయ పత్తి రైతుల పరిరక్షణకు.
5. ఆర్థిక సహాయం గా ఇన్ పుట్ సబ్సిడీ, బీమా పరిహారం, తక్షణం అందించాలి..
పత్తి రైతుల తీవ్ర సంక్షోభం.. వెంటనే ప్రజాప్రతిస్పందన పొందాల్సిన అంశం..
ప్రభుత్వం, మార్కెట్ సంస్థలు, కలసి సమన్వయంగా పని చేయక పోతే గ్రామీణ ఆర్ధిక స్థితి చాలా ప్రమాదం లో పడనుంది.
కర్నూలు జిల్లా నుండి వలసలు పెరిగే ప్రమాదం ఉంది.

– ఎంవీఎస్ నాగిరెడ్డి,
YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్.
ఇవీ చదవండి: Andhra Pradesh : కూటమి ప్రభుత్వంలో సంక్షోభంలో సాగురంగం
Andhra Pradesh : సాగు సంక్షోభానికి సర్కార్ నిర్లక్ష్యమే కారణం
Andhra Pradesh : ఏపీలో సంక్షోభంలో ఖరీఫ్ సాగు.. దిక్కుతోచని రైతాంగం
