OTT Movie : ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రతి వారం ఈ జానర్‌లో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ, ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంటాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోకపోయినా, ఓటీటీలో మాత్రం ఇలాంటి సినిమాలు మంచి ఆదరణ పొందుతుంటాయి. ఇప్పుడు చెప్పబోయే సినిమా కూడా అలాంటి ఇన్టెన్స్ క్రైమ్ థ్రిల్లర్.
ఈ సినిమా మొత్తం విజయవాడలో జరుగుతున్న వరుస హత్యల చుట్టూ తిరుగుతుంది. నగరంలోని అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని, వారిని కిడ్నాప్ చేసి, దారుణంగా హతమారుస్తున్న ఒక సైకో కిల్లర్ చుట్టూ కథ సాగుతుంది. తన క్రూర హత్యలతో పోలీసులకు సవాల్ విసురుతూ, నగరాన్ని భయబ్రాంతులకు గురిచేస్తాడు.
అలాంటి సమయంలో ఒక సాహసోపేతమైన పోలీస్ ఆఫీసర్ కేసు చేధించేందుకు రంగంలోకి దిగుతుంది. ఆమె విచారణలో ఆశ్చర్యపరిచే నిజాలు వెలుగులోకి వస్తాయి. అయితే కిల్లర్ కారణంగా ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం తారుమారవుతుంది. పరిస్థితులు మరింత క్లిష్టమవుతాయి. చివరికి ఆమె డిపార్ట్‌మెంట్‌ను వదిలినా, హత్యల పరంపర కొనసాగుతుండటంతో కిల్లర్‌ను పట్టుకునేందుకు తన సొంత ప్రయత్నాలు మొదలుపెడుతుంది.
ఇంతలో ఒక మహిళను అదుపులోకి తీసుకోవడంతో కిల్లర్ గతం, అతని క్రూరమైన మోటివ్స్ బయటపడతాయి. ఇక మిగతా ప్రశ్నలు – హీరోయిన్ సైకో కిల్లర్‌ను పట్టుకుందా? అతను ఈ స్థితికి ఎందుకు వచ్చాడు? ఎందుకు అమ్మాయిలనే లక్ష్యంగా చేసుకున్నాడు? – అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది.
ఈ ఇన్టెన్స్ క్రైమ్ థ్రిల్లర్ పేరు “దక్షిణ”. ఈ సినిమాలో ఏసీపీ పాత్రలో కోలీవుడ్ స్టార్ విశాల్ కాబోయే భార్య ధన్సిక నటించటం విశేషం. అలాగే రిషభ్ బాసు, మాగ్నా, కరుణ, అంకితా ములెర్, హిమా సైలజా వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఓషో తులసీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రన్‌టైమ్ సుమారు 2 గంటల 8 నిమిషాలు. IMDbలో ఈ మూవీకి 5.4/10 రేటింగ్ వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా Lionsgate Playలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌లను ఆసక్తిగా చూసే వారికి దక్షిణ తప్పక చూడదగ్గ సినిమా.
ఇవీ చదవండి: OTT Movie : నో యాక్షన్.. నో విలన్స్.. కానీ ఓటీటీలో సంచలనం ఈ మూవీ!
OTT Movie: నరబలులు, క్షుద్రపూజలు.. క్రైమ్ థ్రిల్లర్ సంచలనం
