Viral Video: సోషల్ మీడియా పాపులారిటీ కోసం యువత ఎటువంటి రిస్క్‌కైనా వెనుకాడటం లేదు. కొందరు ఫన్నీ రీల్స్ చేస్తుంటే, మరికొందరు ప్రాణాలకే ప్రమాదం కలిగించే స్టంట్స్ చేస్తూ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలాంటి వాటితో ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు, శాశ్వత గాయాలతో మంచానికే పరిమితమైన ఉదాహరణలు ఉన్నా, ఇంకా చాలామంది ఈ ట్రెండ్ ఆపడం లేదు.
హైవేపై డేంజరస్ స్టంట్
ప్రస్తుతం యూపీ బిజ్నోర్ జాతీయ రహదారిపై ఒక బైకర్ చేసిన స్టంట్ వీడియో వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ బైక్‌పై హెల్మెట్ వేసుకున్న ఆ వ్యక్తి, ఒక కాలు సీటుపై, మరో కాలు హ్యాండిల్‌పై పెట్టి స్పీడ్‌గా వెళ్తున్నాడు. బైక్ దూసుకుపోతుండగా టోల్‌గేట్ దాటడం, రోడ్డుపై ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రాక్టర్‌లో కూర్చున్న మహిళలు ఆశ్చర్యంగా చూస్తుండగా, ఆ స్టంట్‌ని మరో వ్యక్తి వీడియో తీయగా అది నెట్టింట్లో వైరల్ అయింది.
నెటిజన్ల స్పందన
ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి స్టంట్స్ వల్ల ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి” అంటూ విమర్శలు చేస్తున్నారు. “పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి” అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.
పోలీసుల రియాక్షన్
వైరల్ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో మీరట్ పోలీసులు స్పందించారు. బైకర్‌ను గుర్తించే ప్రయత్నాలు మొదలయ్యాయని, అతడిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత ఇలాంటి రిస్క్ స్టంట్స్ జోలికి వెళ్లొద్దని కూడా సూచించారు.
ఇవీ చదవండి: Ananya Nagalla : అప్సరసా.. ఏమి ఈ అందం.. అనన్య నాగళ్ల పిక్స్ వైరల్!
Indian Woman Begging : ఏమీటీ దుర్గతి? కెనడాలో భారత యువతి భిక్షాటన? వీడియో వైరల్!
Spirit : స్పిరిట్.. ప్రభాస్-త్రిప్తి డిమ్రి రొమాంటిక్ సీన్స్.. పవర్‌ఫుల్ పోలీస్!
