Watch Video: ఈ రోజుల్లో ఆన్‌లైన్ ఆర్డర్లు మన జీవితంలో భాగమైపోయాయి. మనం యాప్‌లో ఆర్డర్ పెట్టగానే కొద్ది నిమిషాల్లోనే డెలివరీ బాయ్ మన ఇంటి వద్దకు చేరుతాడు. సాధారణంగా డెలివరీ భాగస్వాములు బైక్, స్కూటీ లేదా సైకిల్ వాడతారు. కానీ ఈసారి మాత్రం ఓ బ్లింకిట్ డెలివరీ బాయ్ ఖరీదైన మహీంద్రా థార్ కారులో వచ్చి ఆర్డర్ డెలివరీ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
వీడియోలో ఏం జరిగింది?
ఇన్‌స్టాగ్రామ్‌లో దివ్యగ్రూవ్జ్ షేర్ చేసిన వీడియో ప్రకారం – బ్లింకిట్ డెలివరీ బాయ్ థార్ కారులో కస్టమర్ ఇంటికి చేరుకున్నాడు. కస్టమర్ బాల్కనీలో ఉండటంతో, తాడుతో సరుకులను పైకి పంపించాడు. తర్వాత తిరిగి తన థార్‌లో కూర్చొని వెళ్లిపోయాడు. ఈ సన్నివేశం చూసిన కస్టమర్ ఆశ్చర్యపడి వెంటనే వీడియో తీశాడు.
నెట్టింట్లో వైరల్
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో కాసేపట్లోనే వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
“బ్లింకిట్ డెలివరీ బాయ్స్‌కి ఇంత జీతమా ఇస్తారు?”
“కార్లను తక్కువ ధరకు ఇస్తున్నారా?”
“తదుపరి డెలివరీ కోసం రోల్స్ రాయిస్‌లో రావచ్చు” అంటూ హాస్యాస్పద రియాక్షన్లు షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోతో బ్లింకిట్ డెలివరీపై సరదా చర్చ నెట్టింట్లో మోత మోగిస్తోంది.
ఇవీ చదవండి: Viral video : సముద్రంలో అగ్నిపర్వతం పేలుడు.. షాకింగ్ వీడియో!
Indian Woman Begging : ఏమీటీ దుర్గతి? కెనడాలో భారత యువతి భిక్షాటన? వీడియో వైరల్!
