HomeCinemaPre Wedding Show Movie: ‘మసూద’ హీరో కొత్త సినిమా.. టీజర్ నవ్వులే నవ్వులు

Pre Wedding Show Movie: ‘మసూద’ హీరో కొత్త సినిమా.. టీజర్ నవ్వులే నవ్వులు

Pre Wedding Show Movie: ‘మసూద’ ఫేమ్ తిరువీర్, టీనా శ్రావ్య హీరో–హీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ డ్రామా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్‌ను టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

7 పి.ఎం. ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

విజయ్ దేవరకొండ స్పెషల్ మెసేజ్
టీజర్ రిలీజ్ సందర్భంగా విజయ్ దేవరకొండ, “తిరువీర్ కలల ప్రపంచంలో జీవించటం చూసి నేను సంతోషపడ్డాను. ఈ టీజర్ చాలా ఫ్రెష్‌గా, చల్లని గాలి మనసుని హత్తుకున్నట్టుగా ఉంది” అంటూ చిత్రబృందాన్ని సోషల్ మీడియాలో అభినందించారు.

టీజర్ హైలైట్స్
టీజర్ ‘ఇదేన్నా మా ఊళ్లో రమేష్ ఫొటో స్టూడియో’ అనే డైలాగ్‌తో ప్రారంభమై, హీరో ఫొటోగ్రాఫర్ పాత్రలో ఎంత బిజీగా ఉంటాడో చూపించారు. ‘బర్త్‌డే అయినా, వెడ్డింగ్ అయినా, ప్రీ వెడ్డింగ్ అయినా మన దగ్గరే’ అంటూ హీరో క్యారెక్టర్‌ను రివీల్ చేశారు.
హీరో-హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌ను చూపించే సన్నివేశాల్లో, హీరో సరదాగా అడిగిన ప్రశ్నలకు హీరోయిన్ ఇచ్చే కౌంటర్స్ నవ్వులు పూయిస్తున్నాయి. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పెళ్లి కూతురి తల్లి పెట్టిన కండీషన్స్‌తో హీరో పడే ఇబ్బందులు కూడా వినోదాన్ని పంచుతున్నాయి. టీజర్ చివర్లో హీరో అసిస్టెంట్‌తో జరిగిన కామెడీ సీన్ హైలైట్‌గా నిలిచింది.

టెక్నికల్ టీమ్ & పర్ఫార్మెన్స్
తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ నటన ఆకట్టుకుంటోంది. సురేష్ బొబ్బిలి సంగీతం, కె. సోమశేఖర్ సినిమాటోగ్రఫీ, నరేష్ అడుప ఎడిటింగ్ ఈ సినిమాకు బలాన్నిస్తాయని మేకర్స్ చెబుతున్నారు.

ఇవీ చదవండి: The Raja Saab Teaser : ప్రభాస్ ‘ది రాజా సాబ్’ టీజర్ రిలీజ్.. కేకో కేక
HHVM Trailer Blaze : నెట్టింట హరిహర వీరమల్లు ట్రైలర్ హైప్..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు