Lord Shani: శని గ్రహం ప్రభావం వ్యక్తి జీవితంపై గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య, ఉద్యోగ పరమైన సమస్యలు ఎక్కువగా శని దోషం కారణంగా వస్తాయి. అయితే, కొన్ని రాశుల వారికి శని దోషం ఉన్నప్పటికీ, ఇతర గ్రహాల అనుకూల దృష్టి వల్ల అనూహ్య సహాయం లభిస్తుంది. ప్రస్తుతం గ్రహ సంచారం ప్రకారం మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి శని దోషం ఉన్నా, ఇతర గ్రహాలు ఉపశమనం కలిగిస్తున్నాయి.
మేషం
మేష రాశికి వ్యయస్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి దోషం ఏర్పడింది. దీనివల్ల ఉద్యోగంలో ఇబ్బందులు, ఖర్చులు పెరగడం, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. అయితే లాభస్థానంలో రాహువు ఉండటం వలన పదవీ యోగం, ఆదాయం పెరుగుదల కలుగుతుంది.
సింహం
సింహ రాశివారికి అష్టమ శని దోషం కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల శ్రమ ఎక్కువగా, డబ్బు రాకపోవడం, అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కానీ 2026 జూన్ వరకు గురువు లాభస్థానంలో ఉండటం వలన ఆర్థికంగా, వృత్తిలో మంచి ఫలితాలు దక్కుతాయి.
కన్య
కన్య రాశికి సప్తమ శని సంచారం వల్ల ఉద్యోగం, పెళ్లి వంటి విషయాలు ఆలస్యమవుతాయి. పని భారం ఎక్కువగా ఉంటుంది. కానీ రాశ్యధిపతి బుధుడు, భాగ్యాధిపతి శుక్రుడు బలంగా ఉండటంతో ఈ ఏడాదిలోనే మంచి పురోగతి, ఉద్యోగం, పెళ్లి వంటి విషయాలు అనుకూలిస్తాయి.
ధనుస్సు
ధనుస్సు రాశికి చతుర్థ శని సంచారం కారణంగా అర్ధాష్టమ దోషం ఉంది. దీనివల్ల కుటుంబ సమస్యలు, గృహ వివాదాలు తలెత్తవచ్చు. అయితే రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో ఉండటం వలన ఈ సమస్యలు 2026 వరకు పెద్దగా ప్రభావం చూపవు.
కుంభం
కుంభ రాశికి ద్వితీయ శని సంచారం వల్ల ఏలిన్నాటి దోషం ఏర్పడింది. దీనివల్ల ఆదాయం తగ్గిపోవడం, మాటకు విలువ తగ్గిపోవడం జరుగుతుంది. కానీ పంచమ స్థానంలో గురువు దృష్టి ఉండటం వలన ఈ దోష ప్రభావం తగ్గిపోతుంది. జీవితం సాఫీగా కొనసాగుతుంది.
మీనం
మీనం రాశిలోనే శని సంచారం జరుగుతోంది. దీనివల్ల ఉద్యోగం, ఆరోగ్యం, ఆదాయంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అయితే రాశ్యధిపతి గురువు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉండటంతో ఈ కష్టాలు గణనీయంగా తగ్గుతాయి.
👉 మొత్తంగా, ఈ రాశుల వారికి శని దోషం ఉన్నప్పటికీ, ఇతర గ్రహాల సహకారం వలన సమస్యలు ఎక్కువకాలం నిలవవు. అదృష్టం, పురోగతి, ఆదాయ వృద్ధి కూడా పొందే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: Lord Shani Dev: శని-బుధుల అనుగ్రహం 6 రాశుల వారికి ధనయోగాలు!
Shadashtak Yoga 2025: శని-కుజుల కలయికతో అదృష్టం దక్కే రాశులు ఇవే!
