HomeSportsSuryakumar Yadav : విరాట్, ధోనిలు సాధించలేని రికార్డు సూర్యవశం

Suryakumar Yadav : విరాట్, ధోనిలు సాధించలేని రికార్డు సూర్యవశం

Suryakumar Yadav : ఆసియా కప్ 2025లో భారత జట్టు పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. దుబాయ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 128 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 25 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఈ విజయంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ కెరీర్‌లో ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనిలకు సాధ్యం కాని ఈ ఘనతను సూర్య సాధించడం విశేషం.

కెప్టెన్‌గా సూర్య అద్భుత రికార్డు
సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు భారత జట్టుకు కెప్టెన్‌గా 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. వాటిలో 19 విజయాలు సాధించారు. ఈ సంఖ్యతో ఆయన కోహ్లీ, ధోని కంటే ముందంజలో నిలిచారు.

విరాట్ కోహ్లీ: కెప్టెన్‌గా తొలి 24 మ్యాచ్‌లలో 14 విజయాలు (మొత్తం 50 మ్యాచ్‌లలో 30 గెలుపులు).

ఎంఎస్ ధోని: తొలి 24 మ్యాచ్‌లలో 11 విజయాలు (మొత్తం 72 మ్యాచ్‌లలో 41 గెలుపులు).

రోహిత్ శర్మ: తొలి 24 మ్యాచ్‌లలో 20 విజయాలు సాధించి, ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు. రోహిత్ మొత్తం 62 మ్యాచ్‌లలో 49 గెలుపులు సాధించారు.

ఈ క్రమంలో సూర్యకుమార్ 19 విజయాలతో రెండో స్థానంలో నిలిచి, కోహ్లీ, ధోనిలను వెనక్కి నెట్టారు.

పాకిస్థాన్‌పై సూర్య ప్రతిభ
ఈ కీలక పోరులో సూర్యకుమార్ నాయకత్వం మాత్రమే కాకుండా, తన బ్యాటింగ్‌తోనూ మెప్పించారు. 37 బంతుల్లో అజేయంగా 47 పరుగులు సాధించారు. ఐదు ఫోర్లు, ఒక సిక్స్ బాదిన ఆయన చివర్లో సిక్స్ కొట్టి జట్టుకు గెలుపు ముద్ర వేశారు.

భారత్–పాకిస్థాన్ పోరులో సాధించిన ఈ విజయం, సూర్యకుమార్ కెప్టెన్సీ రికార్డుతో కలిపి అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపింది.

ఇవీ చదవండి: IND vs PAK: సూర్యకుమార్ యాదవ్‌ సంచలన నిర్ణయం – పాక్ జట్టుతో హ్యాండ్‌షేక్‌కు నిరాకరణ
Asia Cup 2025 : ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ఇదే.. కెప్టెన్ సూర్య!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు