HomeBusinessPrice Drop: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్‌లో నథింగ్‌ ఫోన్స్‌పై భారీ ఆఫర్స్

Price Drop: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్‌లో నథింగ్‌ ఫోన్స్‌పై భారీ ఆఫర్స్

Price Drop: ప్రతి ఏడాది వినియోగదారులు ఎదురుచూసే Flipkart Big Billion Days Sale 2025 ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. ఆమేజాన్ కూడా తమ ఫెస్టివల్ సేల్‌ను అదే సమయంలో మొదలుపెట్టనుంది. ఈ సేల్స్‌లో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఉండబోతున్నాయి. అయితే, ఈసారి ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా Nothing Phones పై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి.

నథింగ్ ఫోన్స్‌పై డీల్స్

Nothing Phone 3a
ప్రారంభ ధర: ₹22,999 → సేల్ ధర: ₹20,999

Nothing Phone 3a Pro
ప్రారంభ ధర: ₹27,999 → సేల్ ధర: ₹24,999

CMF Phone 2 Pro (Base Variant)
ప్రారంభ ధర: ₹18,999 → సేల్ ధర: ₹14,999

ప్రత్యేక అప్‌గ్రేడ్ ఆఫర్
నథింగ్ ఫోన్ 1 లేదా ఫోన్ 2 యూజర్స్‌ కోసం కంపెనీ ప్రత్యేక అప్‌గ్రేడ్ స్కీమ్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్‌లో పాత ఫోన్ ఇచ్చి కొత్త Nothing Phone 3 ను కేవలం ₹34,999 కు పొందొచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఫోన్ జూలైలో లాంచ్ అయినప్పుడు ధర ₹79,999 ఉండగా ఇప్పుడు భారీ తగ్గింపుతో అందుబాటులోకి వస్తోంది.

బడ్జెట్ నుండి ప్రీమియం వరకూ, నథింగ్ కంపెనీ ఫోన్లు ఈసారి అద్భుతమైన ధరలకు లభించబోతున్నాయి. కొత్త ఫోన్‌ కొనే ఆలోచనలో ఉన్నవారికి ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ మిస్‌ కాకుండా చూసుకోవాలి.

ఇవీ చదవండి: Galaxy S25 FE : సామ్‌సంగ్ Galaxy S25 FE, కొత్త టాబ్లెట్లు ఆఫర్లలో!
Infinix Zero Flip: ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ అదిరిపోయాయిగా!
Flipkart Big Billion Days 2025: మోటోరోలా ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్లు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు