Betting Apps : టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్‌గా పేరుగాంచిన సురేష్ రైనాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. (Betting Apps)
సమాచారం ప్రకారం, రైనా 1xBet అనే బెట్టింగ్ యాప్‌కు ప్రచారకర్తగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ యాప్‌తో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై స్పష్టత కోసం ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ విచారణ ఢిల్లీ ఈడీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది.
అక్రమ బెట్టింగ్ యాప్‌ల వల్ల దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మోసాలు జరుగుతున్నాయని ఈడీ ఇప్పటికే గుర్తించింది. ఈ యాప్‌లకు ప్రచారం చేసిన సినీ ప్రముఖులు, క్రికెటర్లు కూడా దర్యాప్తు కంట్లో పడ్డారు.
ఇప్పటికే రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి తదితరులు ఈ కేసులో విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా రైనా పేరు కూడా జాబితాలో చేరింది.
నిపుణుల అంచనా ప్రకారం, ఈడీ తీసుకున్న కఠిన చర్యలు ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాపై బలమైన దెబ్బ కొడతాయని, అక్రమ బెట్టింగ్ వ్యాపారంపై కొంతమేర నియంత్రణ సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
ఇవీ చదవండి: Dhoni Relation : మహేంద్రసింగ్ ధోనితో రిలేషన్.. నటి సంచలన వ్యాఖ్యలు!
Sanju Samson: ధోనిని దాటేసిన సంజూ శాంసన్.. ఎందులో అంటే!
