Crime News : ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్న విషయాలకే భార్యభర్తల మధ్య గొడవలు తీవ్ర రూపం దాల్చుతున్న తరుణంలో, చికెన్ వండలేదని భర్త చేసిన పని ఊహించలేనిది. Crime News
ఘటనా వివరాలు
అమ్రోహాకు చెందిన నిగమ్ అనే యువకుడు భార్య రీనాతో 10 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆగస్టు 21న నిగమ్ మద్యం మత్తులో చికెన్ తీసుకొచ్చి భార్యకు వండమని చెప్పాడు. అయితే రీనా మాత్రం వెజిటేరియన్ వంటకం చేసింది. దీంతో కోపంతో నిగమ్ ఆమెపై దాడి చేశాడు.
భార్య ఆత్మహత్య
భర్త ప్రవర్తనతో మనస్థాపం చెందిన రీనా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంతో భయపడిన నిగమ్, తన బంధువుల సహాయంతో రీనా మృతదేహాన్ని ఒక షీట్‌లో చుట్టి గంగా నదిలో పడేశాడు. తరువాత అనుమానాలు రాకుండా పోలీసులకు భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తులో నిజాలు బయటకు
రీనా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నిగమ్ నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పటివరకు నిగమ్‌తో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిగమ్ తల్లిదండ్రులు ఇంకా పరారీలో ఉన్నారు.
రీనా సోదరుడు తన చెల్లెలి మృతదేహాన్ని కనుగొని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: Tamilnadu Crime : 15 ఏళ్లుగా సర్పంచ్.. చోరీల బ్యాగ్రౌండ్ తెలిసి షాక్!
Telangana Crime : ప్రియుడితో కలిసి నా భార్య నన్ను చంపాలని..!
Karnataka Crime : భర్త నిద్రపోతుండగా ప్రియుడితో భార్య.. చంపేద్దామని!
