HomeAndhra PradeshEenadu and Sakshi Circulation : తగ్గుతున్న ఈనాడు సర్క్యులేషన్.. దూసుకెళ్తున్న సాక్షి

Eenadu and Sakshi Circulation : తగ్గుతున్న ఈనాడు సర్క్యులేషన్.. దూసుకెళ్తున్న సాక్షి

Eenadu and Sakshi Circulation : దేశ వ్యాప్తంగా పత్రికల సర్క్యులేషన్ గణాంకాలను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ABC) తాజాగా ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి జూన్ దాకా దేశంలోని వివిధ పత్రికల సర్క్యులేషన్ వివరాలను ఏబీసీ వెల్లడించింది. ఎప్పటిలాగే హిందీ పత్రిక దైనిక్ భాస్కర్ ఇండియాలో టాప్ పత్రికగా నిలిచింది. ఆ పత్రిక సర్క్యులేషన్ 30,40,724 ఉంది.
ఇక తెలుగు దినపత్రికలకు సంబంధించి అగ్రస్థానంలో ఉన్న ఈనాడు పత్రిక సర్క్యులేషన్ కాస్త తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ తెలుగులో నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. అదే క్రమంలో సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఏపీలో పెరుగుతోంది. ఏపీలో కొన్ని జిల్లాల్లో ఈనాడు సర్క్యులేషన్ ను సాక్షి డామినేట్ చేస్తోంది. అయితే, అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఈనాడు సర్క్యులేషనే ఎక్కువగా ఉంది. (Eenadu and Sakshi Circulation)

వైభవాన్ని కోల్పోతున్న ఈనాడు
లార్జెస్ట్ సర్క్యులేషన్ ఈనాడు పత్రిక రోజురోజుకూ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఏపీలో సర్క్యులేషన్ తగ్గడమే ఇందుకు తార్కాణం. గతంలో ఎప్పుడూ ఈనాడు ఎవరికీ అందనంత ఎత్తులో ముందంజలో ఉండేది. కానీ గతమెంతో ఘనం అన్నట్టుగా నానాటికీ తీసికట్టుగా పరిస్థితి మారుతోంది. గతేడాది 2024 జూలై నుంచి డిసెంబర్ దాకా ఏబీసీ వెలువరించిన గణాంకాల్లో ఈనాడు పత్రిక సర్క్యులేషన్ 12,15,722 ఉండేది. 2025 జనవరి నుంచి జూన్ కు సంబంధించి అదే ఏబీసీ వెల్లడించిన లెక్కల్లో మాత్రం 11,82,236గా నమోదై ఈనాడు సర్క్యులేషన్ భారీ స్థాయిలో పతనమైంది. అంటే దాదాపు 33 వేలకు పైగా కాపీలు తగ్గాయి.

ఈనాడుపై పూర్తిగా టీడీపీ ముద్ర
ఒకప్పుడు న్యూట్రల్ ప్రజలు, ఓటర్లు ఎక్కువగా చదివే పత్రిక ఈనాడు. రాజకీయం ఎలా ఉన్నా వార్తలను బాగా కవర్ చేస్తారని, అన్ని వర్గాల వారికీ చేరువైన పత్రికగా నిలిచింది. అయితే, రానురానూ కంటెంట్ తగ్గిపోయి, నాసిరకంగా మారుతుండడం, అందులోనూ కేవలం వైఎస్ జగన్ టార్గెట్ గా, వైఎస్సార్ సీపీ నేతలపై ఆరోపణలు, కుంభకోణాలంటూ తప్పుడు వార్తలు రాస్తోందన్న ముద్ర ఈనాడుపై పడింది. ఆధారాల్లేకుండా వార్తలు రాయడం, కట్టుకథలు అల్లి లేనిపోనివన్నీ ప్రజలపై రుద్దాలని, పొలిటికల్ అజెండాతో ముందుకెళ్లడం కూడా ఈనాడు సర్క్యులేషన్ తగ్గడానికి కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఇదే పని చేసి, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రతిరోజూ పతాక శీర్షికన జగన్.. జగన్.. జగన్.. అవినీతి.. వైకాపా.. అని కలవరిస్తున్నట్లు వార్తలు ప్రచురిస్తోందని గుర్తు చేస్తున్నారు. జగన్ అనే పేరు లేకుండా ఎప్పుడూ ఈనాడు పత్రిక వెలువడదని కుండబద్ధలు కొడుతున్నారు. ఈ క్రమంలోనే పాఠకులు విసుగు చెందారన్న విశ్లేషణలు వస్తున్నాయి.

తెలుగులో ఈనాడు, సాక్షి పత్రికల మధ్య సర్క్యులేషన్ గ్యాప్ తగ్గుతోంది. ఈనాడు ఒకప్పుడు 14.8 లక్షల దాకా సర్క్యులేషన్ వెళ్లిన దాఖలాలు ఉండేవి. కానీ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అది భారీగా పతనమైంది. నేడు కేవలం 11.8 లక్షలకు పడిపోయింది. తెలంగాణలో సాక్షికన్నా ఈనాడుకు 1.25 లక్షల దాకా కాపీలు అధికంగా ఉన్నాయి. అదే ఈనాడును పడిపోకుండా కాపాడుతోందని సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. ఏపీలో మరీ ముఖ్యంగా సాక్షి గణనీయమైన పోటీ ఇస్తోంది. తెలంగాణలో ఈనాడుకు 5,13,482 సర్క్యులేషన్ ఉంది. అదే సాక్షికి 3,88,527 సర్క్యులేషన్ ఉంది. అంటే దాదాపు 1.25 లక్షల దాకా ఈనాడు ఆధిపత్యం ఉంది.

జిల్లాల్లో ఈనాడు వర్సెస్ సాక్షి.. పోటా పోటీ
ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఈనాడు కన్నా సాక్షి కాపీలే అధికంగా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఈనాడు సర్క్యులేషన్ 51 వేలు ఉండగా, సాక్షికి 48 వేలు ఉంది. అంటే దాదాపు సాక్షి 3 వేల కాపీలు వెనుకబడి ఉంది. కడప జిల్లాలో ఈనాడుకు 44 వేల సర్క్యులేషన్ ఉంటే, సాక్షికి 37 వేలే ఉంది. అంటే 7 వేల కాపీలు వెనుకబడి ఉంది. గుంటూరు జిల్లాకు సంబంధించి ఈనాడు 74 వేలు ఉండగా, సాక్షి 72 వేలు ఉంది. రాజమండ్రిలో ఈనాడు 68 వేలు ఉంటే, సాక్షి కేవలం 58 వేలే ఉంది.

నెల్లూరు జిల్లాలో ఈనాడు 32 వేల కాపీలుంటే, సాక్షి మాత్రం 37 వేలుఉంది. 5 వేల కాపీలు ఈ జిల్లాలో సాక్షి అధికంగా ఉంది. మరోవైపు కర్నూలు జిల్లాలోనూ ఈనాడు 43 వేలు ఉంటే, సాక్షి 52 వేలు ఉంది. ఒంగోలు జిల్లాలో ఈనాడు 27 వేలుంటే, సాక్షి ఏకంగా 41,352 కాపీలతో అందుకోలేని స్థాయిలో ఉంది. అంటే దాదాపు 15 వేలు అదనంగా ఉంది. ఒంగోలు, కర్నూలు, నెల్లూరులో సాక్షి ప్యూడ్ డామినేషన్ ప్రదర్శిస్తోంది. అయితే, తాడేపల్లిగూడెంలో ఈనాడు 56 వేలు ఉంటే సాక్షి మాత్రం 49 వేలే ఉంది.

తిరుపతిలో ఈనాడు 40 వేలుంటే, సాక్షి 46 వేలుంది. ఇక విజయవాడలో ఈనాడు 85 వేలుంటే, సాక్షి మాత్రం 61 వేల కాపీలతో 24 వేలు వెనుకబడి ఉంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈనాడు 46 వేలు ఉంటే సాక్షి 51 వేలతో దూసుకెళ్తోంది. విశాఖలో మాత్రం ఈనాడుకు 81 వేలుంటే సాక్షి చాలా వెనుకబడి 54 వేలే ఉంది. విజయవాడ, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి లాంటి నగరాల్లో సాక్షి తక్కువగా సర్క్యులేషన్ ఉంది. ఓవరాల్ గా ఏపీకి సంబంధించి ఈనాడు సర్క్యులేషన్ 6.51 లక్షలు ఉంటే సాక్షి 6.12 లక్షలుగా ఉంది. రాష్ట్రంలో కేవలం 38 వేలే తేడా ఉంది.

స్వల్పంగా తగ్గినా నిలబడిన సాక్షి సర్క్యులేషన్
అదే క్రమంలో సాక్షి పత్రిక సర్క్యులేషన్ 2024 జూలై నుంచి డిసెంబర్ మాసాలకు సంబంధించి వెలువరించిన గణాంకాల్లో సాక్షికి 10,15,573 సర్క్యులేషన్ ఉండేది. 2025 జనవరి నుంచి జూన్ మాసాలకు సంబంధించి ఇదే ఏబీసీ వెల్లడించిన గణాంకాల్లో సాక్షి సర్క్యులేషన్ 10,09,453గా నమోదైంది. అంటే రమారమి 6 వేల కాపీలు తగ్గినట్లయింది. ఓవరాల్ గా సాక్షి తన సర్క్యులేషన్ భారీ స్థాయిలో పతనం కాకుండా నిలబడింది. 2024లో వైఎస్ జగన్ అధికారం కోల్పోయిన నేపథ్యంలో సాక్షి పత్రిక ప్రతిపక్షంగా మారి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న తరుణంలో సహజంగానే ప్రజలు సాక్షిని చదవడానికి మొగ్గుచూపుతున్నారు. తెలుగులో ఈనాడు తర్వాత సాక్షి పత్రికనే ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సర్క్యులేషన్ లో సాక్షికి 11వ స్థానం దక్కింది.

ఓవరాల్ గా చూస్తే..
మొత్తంగా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ తాజా గణాంకాలు చూస్తే, మరీ ముఖ్యంగా తెలుగులో చూస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మెట్రో ఎడిషన్లతో కలిపి ఈనాడు సర్క్యులేషన్ 11,82,236 ఉంది. దేశ వ్యాప్తంగా ఇది 8వ స్థానంలో కొనసాగుతోంది. తెలుగు పత్రికల్లో ఇది అగ్ర స్థానం. అదే సమయంలో సాక్షి పత్రిక సర్క్యులేషన్ చూస్తే.. 10,09,453 ఉంది. ఇది దేశ వ్యాప్తంగా 11వ స్థానం. ఏపీలో మాత్రం సాక్షి పత్రిక సర్క్యులేషన్ పుంజుకోవడం ఆసక్తికర అంశం.

ఇవీ చదవండి: Sakshi: ‘సాక్షి’కి నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్ ఇచ్చారా?
Kommineni Srinivasa Rao: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు