HomeInternationalBanned Items : ఆ దేశాలకు ఇవి తీసుకెళ్తే శిక్ష.. ఆశ్చర్యపరిచే నిషేధాలు!

Banned Items : ఆ దేశాలకు ఇవి తీసుకెళ్తే శిక్ష.. ఆశ్చర్యపరిచే నిషేధాలు!

Banned Items : విదేశాలకు ప్రయాణం చేసే ముందు అక్కడి నిబంధనలు తెలియకపోతే పెద్ద సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. తాజాగా ఆస్ట్రేలియాలో ఓ ఘటన ఈ విషయాన్ని రుజువు చేసింది. ఓనమ్ వేడుకల కోసం మెల్‌బోర్న్ వెళ్లిన నవ్య నాయర్ తన జడను మల్లెపూలతో అలంకరించుకుంది. అంతేకాకుండా కొన్ని పూలను హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుంది. కానీ ఆస్ట్రేలియాలో మల్లెపూలపై నిషేధం ఉండడంతో ఆమెను విమానాశ్రయంలో ఆపి రూ.1.15 లక్షల జరిమానా విధించారు. (Banned Items)

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇలాంటి ఆశ్చర్యకర నిషేధాలు అమల్లో ఉన్నాయి.

కెనడా: చిన్నారుల కోసం వాడే బేబీ వాకర్‌ను పూర్తిగా నిషేధించారు. పిల్లలకు గాయాలు అవుతాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాకర్ తీసుకెళ్తే దాదాపు 88 లక్షల రూపాయల ఫైన్ విధిస్తారు.

ఇరాన్: అక్కడ పాశ్చాత్య ఫ్యాషన్‌ను కట్టడి చేసేందుకు పోనీ టెయిల్ హెయిర్ స్టైల్ మరియు ట్రెండీ హెయిర్‌కట్స్ పై నిషేధం ఉంది. నిబంధనలు అతిక్రమిస్తే అరెస్టు, జుట్టు కత్తిరించడం వంటి శిక్షలు ఉంటాయి.

సింగపూర్: ఇక్కడ చూయింగ్‌గమ్ పూర్తిగా బ్యాన్‌ అయింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సెన్సర్లకు నష్టం కలగకుండా ఈ నిషేధం అమలు చేస్తున్నారు. ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది.

గ్రీస్: చారిత్రక కట్టడాలను రక్షించేందుకు అక్కడ హైహీల్స్ ధరించి పర్యటించడం నిషిద్ధం. దీనిని అతిక్రమిస్తే ఫైన్ తప్పదు.

ఉత్తర కొరియా: అక్కడ బ్లూ జీన్స్ ధరించడం నేరం. పాశ్చాత్య సంస్కృతిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ నిషేధం అమలు చేస్తున్నారు. దీన్ని అతిక్రమిస్తే జైలు, జరిమానా తప్పవు.

ప్రయాణానికి ముందుగా ఇలాంటి స్థానిక నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం. లేదంటే చిన్న పొరపాటే పెద్ద శిక్షలకు దారి తీస్తుంది.

ఇవీ చదవండి: PM Modi’s historic Ghana visit: 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఘనా పర్యటన.. ముఖ్యాంశాలివీ!
OTT Movie : సోనీ లివ్‌లో అద్భుతమైన సినిమాలు, సిరీస్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్స్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు