HomeAndhra PradeshWay2News Conclave 2025 : మా పాలనలో అభివృద్ధే.. రాష్ట్రం అప్పులపాలైందన్నది అవాస్తవం : బుగ్గన

Way2News Conclave 2025 : మా పాలనలో అభివృద్ధే.. రాష్ట్రం అప్పులపాలైందన్నది అవాస్తవం : బుగ్గన

Way2News Conclave 2025 : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడిందని, అప్పుల పాలు అయిపోయాయంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాలు అవాస్తవమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వే2న్యూస్ నిర్వహించిన కాంక్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. Way2News Conclave 2025

మా పాలనలో 5% పెరుగుదల
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొదటి పరిపాలనలో (2014-2019) వ్యవసాయ శాఖ జీడీపీలో 35% ఉండగా, వైసిపి పాలనలో 5% పెరిగిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. “పునవ్యవస్థీకరణ జరిగిన తర్వాత రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడింది” అని చెప్పారు. 2015 నుంచి 2019 వరకు కేంద్రం నుండి 3.7% నిధులు వచ్చాయి, కానీ 2019 నుంచి 2024 వరకు 3% మాత్రమే వచ్చాయన్నారు. “కేంద్రం నుండి కొన్ని వేల కోట్లలు నిధులు 2019 నుండి 24 వరకు తక్కువగా వచ్చాయి” అని ఆరోపించారు.

2014 నుంచి 2019 వరకు మునుపటి ప్రభుత్వం పరిమితి దాటి రూ.29 వేల కోట్లు అప్పు చేసిందని, అయితే వైసిపి పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేశామని బుగ్గన చెప్పారు. “2019 నుండి 24 వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఈరోజు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు” అని గుర్తు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ వల్ల ప్రజలు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని, స్టూడెంట్స్, యువత మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

మా పాలనలో 3 లక్షల కోట్లు.. ఈ ప్రభుత్వం 1.8 లక్షలు ఒక సంవత్సరంలో!
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపాలైందనటం అవాస్తవం” అని బుగ్గన స్పష్టం చేశారు. మా ప్రభుత్వం (వైసిపి) ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల కోట్లు అప్పు చేసిందని, కానీ ఈ ప్రభుత్వం (టీడీపి లీడ్ NDA) సంవత్సర కాలంలోనే రూ.1,80,000 కోట్లు అప్పు చేసేసిందని ఆరోపించారు. “ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మా ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తుంది” అని చెప్పారు. అప్పు చేసిన డబ్బులు ఎక్కడ పెట్టుబడులు పెట్టారో చూస్తే ఎక్కడా స్థిరంగా కనిపించడం లేదని విమర్శించారు.

కేంద్ర పరిశీలక (CAG) రిపోర్ట్‌ను ఉదహరించి, 2023-24లో రెవెన్యూ రసీప్టులు ₹1,73,767 కోట్లు ఉండగా, 2024-25లో ₹1,68,443 కోట్లకు తగ్గాయని, రాష్ట్ర సొంత రెవెన్యూ 3.08% మాత్రమే పెరిగిందని చెప్పారు. వైసిపి పాలనలో (2019-2024) సొంత టాక్స్ రెవెన్యూ 10.04% CAGRతో పెరిగిందని, కోవిడ్ ప్రభావం ఉన్నా అభివృద్ధి సాధించామని గుర్తు చేశారు. ఆఫ్-బడ్జెట్ బారోయింగ్స్ పెరగడం రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అని హెచ్చరించారు.

లక్ష కోట్లతో నగరం కట్టటం మంచిదా.. ప్రజల అభివృద్ధి మంచిదా?
రాజధాని గురించి మాట్లాడుతూ, “రాజధాని ఎక్కడైనా కట్టొచ్చు కానీ కొన్ని పద్ధతిలో ఉంటాయి.. ఒక మహా నగరమే కట్టాలని చూస్తే వీలవుతుందా” అని బుగ్గన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని గురించి మాట్లాడిన ప్రతిసారి “మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం” అంటూ మొదలుపెడతారని విమర్శించారు. “లక్ష కోట్లతో ఒక నగరం నిర్మించటం మంచిదా లేదా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి చేయటం మంచిదా అని ఆలోచించుకొని డబ్బు ఖర్చు చేయాలి” అని సూచించారు.

ల్యాండ్ పూలింగ్ ద్వారా వేలాది ఎకరాలు భూమి తీసుకున్న ప్రాంతం వరద నీరు వచ్చే ప్రదేశమని, అలాంటి ప్రాంతంలో మహా నగరం నిర్మించడం అసాధ్యమని చెప్పారు. ఐఠీ విభాగం అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అన్ని విధాల అనుకూలమైనది వైజాగ్ అని తేల్చడం జరిగిందని బుగ్గన తెలిపారు. వ్యవసాయం, విద్య అభివృద్ధి చెందాలంటే విజయవాడ, గుంటూరు మంచివని, వెనక్బడిన రాయలసీమ ప్రాంతానికి ఇరిగేషన్ ద్వారా నీరు తెచ్చే ప్రయత్నం చేశామని గుర్తు చేశారు.

ఇవీ చదవండి: Way2news Conclave : జగన్ విజన్‌తో అభివృద్ధి.. చంద్రబాబు కలలు అసాధ్యం.. వే2న్యూస్ కాంక్లేవ్‌లో సజ్జల కామెంట్స్
YS Jagan PC : మహిళలకు రూ.1,500, నిరుద్యోగభృతి ఏదీ? సూపర్ సిక్స్ ఎలా హిట్? : జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు