HomeCrime NewsPolice Station : మోసగాళ్లకు మోసగాడు.. పోలీస్ స్టేషన్‌కే ఎసరు పెట్టాడు!

Police Station : మోసగాళ్లకు మోసగాడు.. పోలీస్ స్టేషన్‌కే ఎసరు పెట్టాడు!

Police Station : ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ బంజరు భూమిని ఆక్రమించిన సంచలనాత్మక కేసు బయటపడింది. మీరట్ జిల్లా పల్లవ్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసి, కాలనీలుగా మార్చి విక్రయించారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఈ భూమిలో కొంత భాగం పోలీస్ స్టేషన్‌కే చెందినదని బయటపడింది. భూమి విలువ దాదాపు రూ.20 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. Police Station

సర్ధానా తహసీల్ పరిధిలోని ముయికంపూర్ ఎల్ఖేడి గ్రామంలోని ఖాస్రా నంబర్ 609/5లో ఉన్న 0.5060 హెక్టార్ల భూమి రెవెన్యూ రికార్డుల్లో బంజరు భూమిగా నమోదు అయింది. అయితే నిందితులు పత్రాలను తారుమారు చేసి దానిని ప్రైవేట్ ఆస్తిగా చూపించి, కాలనీలు నిర్మించారు. మధుర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్, చందన్‌పాల్ అసోసియేట్స్, రామ్‌కుమార్ కుమారుడు సిద్ధార్థ్ పన్వర్ పేర్లతో యాజమాన్యం చూపించి ప్లాట్లు అమ్మినట్లు దర్యాప్తులో తేలింది.

వివరాల ప్రకారం, మధుర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ 0.3667 హెక్టార్ల భూమిపై 3420 చదరపు మీటర్ల కాలనీ నిర్మించగా, చందన్‌పాల్ అసోసియేట్స్, సిద్ధార్థ్ పన్వర్ మిగిలిన 0.1520 హెక్టార్లపై దాదాపు 1900 చదరపు మీటర్ల కాలనీ అభివృద్ధి చేశారు. మొత్తంగా 2060 చదరపు మీటర్లకు పైగా భూమిని అక్రమంగా విక్రయించారు.

మధుర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్లు ఆశిష్ గుప్తా, ఆదిత్య గుప్తా, జై గుప్తా, చందన్‌పాల్ అసోసియేట్స్ అంకుర్ కుమార్, అనిల్ కుమార్, అలాగే సిద్ధార్థ్ పన్వర్ ఈ మోసంలో పాలుపంచుకున్నారని పోలీసులు తెలిపారు. వీరంతా రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ఆస్తిగా మార్చి కోట్ల లాభాలు ఆర్జించినట్టు స్పష్టమైంది.

ఈ వ్యవహారం బయటపడిన తర్వాత జూలైలో కేసు నమోదు చేయగా, ప్రస్తుతం ఇద్దరు నిందితులు పోలీసులు అరెస్టు అయ్యారు. మిగతా నిందితులపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఆస్తిని దోచుకోవడమేనని మండిపడుతున్నారు.

ఇవీ చదవండి: Tamilnadu Crime : 15 ఏళ్లుగా సర్పంచ్.. చోరీల బ్యాగ్రౌండ్ తెలిసి షాక్!
Dowry Harassment: పెళ్లైన నాలుగు నెలలకే యువతి ఆత్మహత్య

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు