HomeCrime NewsDowry Harassment: పెళ్లైన నాలుగు నెలలకే యువతి ఆత్మహత్య

Dowry Harassment: పెళ్లైన నాలుగు నెలలకే యువతి ఆత్మహత్య

Dowry Harassment: వరకట్న వేధింపులు దేశంలో రోజు రోజుకీ ఆందోళన కలిగించే స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో విషాదం చోటుచేసుకుంది. వివాహం జరిగిన నాలుగు నెలలకే మయూరి గౌరవ్ తోసర్ (23) అనే యువతి వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. Dowry Harassment

మయూరి నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి అయిన కొన్ని రోజులకే ఆమెపై అత్తమామల హింస మొదలైందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మాత్రమే కాకుండా, అదనపు డబ్బు కోసం నిరంతరం ఒత్తిడి చేసినట్టు వారు పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులు అనేకసార్లు రాజీకి ప్రయత్నించినా పరిస్థితి మారలేదని, చివరికి మయూరి తన పుట్టిన రోజు జరిగిన మరుసటి రోజే ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.

ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆమె తల్లిదండ్రులు, తమ కూతురి మరణానికి కారణమైన అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన మరోసారి వరకట్న వేధింపుల సమస్య ఎంత తీవ్రమైందో చూపిస్తోంది.

ఇవీ చదవండి: Tamilnadu Crime : 15 ఏళ్లుగా సర్పంచ్.. చోరీల బ్యాగ్రౌండ్ తెలిసి షాక్!
Telangana Crime : ప్రియుడితో కలిసి నా భార్య నన్ను చంపాలని..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు