HomeNationalVideo : బస్సులో డ్రైవర్‌, మహిళా ప్రయాణికురాలి మధ్య ఘర్షణ.. చివరికి!

Video : బస్సులో డ్రైవర్‌, మహిళా ప్రయాణికురాలి మధ్య ఘర్షణ.. చివరికి!

Video : ఇటీవల బస్సుల్లో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది మధ్య గొడవలు తరచుగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కండక్టర్లతో, మరికొన్ని చోట్ల డ్రైవర్‌లతో వివాదాలు చెలరేగుతున్నాయి. అలాంటి ఘటనే ఇప్పుడు కర్ణాటకలో చోటుచేసుకుంది. బీఎంటీసీ బస్సులో డ్రైవర్‌, మహిళా ప్రయాణికురాలి మధ్య వాగ్వాదం చెలరేగి, చివరికి చెంపదెబ్బల వరకూ వెళ్లింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద చర్చకు దారితీసింది. Video

బెంగళూరులోని పీన్యా సమీపంలో నడుస్తున్న బీఎంటీసీ బస్సులో ఈ సంఘటన జరిగింది. ఒక చిన్న తగాదా మాటా మాటా పెరిగి పెద్ద గొడవగా మారింది. ఈ క్రమంలో డ్రైవర్‌, ప్రయాణికురాలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించినా, ఇద్దరూ వినలేదు. దాదాపు అరగంట పాటు ఈ గొడవ కొనసాగింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు సెల్‌ఫోన్లలో రికార్డు చేసి, తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశారు. “కర్ణాటక పోర్ట్‌ఫోలియో” అనే ఎక్స్‌ ఖాతాలో వీడియో పోస్టు చేయబడటంతో అది వేగంగా వైరల్ అయింది.

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే బెంగళూరు పోలీసులు స్పందించారు. ఘటనపై ఫిర్యాదు అందిందని, దాన్ని సంబంధిత అధికారులకు పంపించినట్లు తెలిపారు. అలాగే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ గొడవకు అసలు కారణం ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు.

ఈ ఘటనపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు డ్రైవర్‌ను తప్పుపడుతుండగా, మరికొందరు మాత్రం మహిళదే తప్పని అంటున్నారు. విధుల్లో ఉన్న ఉద్యోగిపై దాడి చేసిందని, ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి: Viral video : పిల్లల్ని సన్ రూఫ్ పైకి ఎక్కిస్తున్నారా? ఈ వీడియో చూడండి!
Indian Woman Begging : ఏమీటీ దుర్గతి? కెనడాలో భారత యువతి భిక్షాటన? వీడియో వైరల్!
Amity University : అమిటీ వర్సిటీ.. 26 సార్లు చెంపదెబ్బలు కొట్టించిన విద్యార్థిని.. వీడియో వైరల్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు