HomeInternationalLunar Eclipse Effect : చంద్రగ్రహణం నుండి సూర్యగ్రహణం వరకు – నేపాల్, ఫ్రాన్స్ రాజకీయాలపై...

Lunar Eclipse Effect : చంద్రగ్రహణం నుండి సూర్యగ్రహణం వరకు – నేపాల్, ఫ్రాన్స్ రాజకీయాలపై ప్రకంపనలు

Lunar Eclipse Effect : సెప్టెంబర్ 2025లో వరుసగా రెండు శక్తివంతమైన ఖగోళ సంఘటనలు చోటు చేసుకున్నాయి. సెప్టెంబర్ 7-8 తేదీలలో చంద్రగ్రహణం, ఆ తర్వాత సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం. జ్యోతిష శాస్త్రం ప్రకారం రెండు గ్రహణాలు దగ్గర దగ్గరగా సంభవిస్తే దాన్ని గ్రహపక దోషం అంటారు. భవిష్య పురాణం ప్రకారం, అలాంటి సందర్భంలో రాజులు ఇబ్బందులు ఎదుర్కొని, ప్రజల్లో తిరుగుబాటు చెలరేగుతుందని పేర్కొంది. Lunar Eclipse Effect

నేపాల్‌లో ఉద్రిక్తతలు:
సెప్టెంబర్ 7-8 చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు కుంభం, మీన రాశుల సరిహద్దులో ఉండగా, రాహు నీడ పూర్తిగా కప్పివేసింది. కుంభ రాశి సామూహిక శక్తికి సంకేతం కావడంతో దాని ప్రభావం నేపాల్ రాజకీయాల్లో వెంటనే కనబడింది. జనరల్ జెడ్ ఉద్యమం హింసాత్మకంగా మారి, సుప్రీంకోర్టు నుండి ప్రధానమంత్రి నివాసం వరకు నిరసనలు మిన్నంటాయి. ఖాట్మండు సింగ్ దర్బార్‌ కూడా నిరసనకారుల ఆధీనంలోకి వెళ్లింది. చివరకు ప్రధాని కె.పి. ఓలి రాజీనామా చేసి అదృశ్యమయ్యారు.

ఫ్రాన్స్‌లో ఆందోళనలు:
నేపాల్ తర్వాత ప్రభావం ఫ్రాన్స్‌లో స్పష్టమైంది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో పారిస్ వీధుల్లో లక్షలాది ప్రజలు ఆందోళనలకు దిగారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు 80,000 మంది పోలీసులను మోహరించినా హింస ఆగలేదు. బస్సులు, రైళ్లను తగులబెట్టారు. 250 మందికి పైగా అరెస్టులు జరిగాయి. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్నును కొత్త ప్రధానమంత్రిగా నియమించినా ప్రజలు దీన్ని అంగీకరించలేదు. ఒకే నెలలో రెండు గ్రహణాలు సంభవించడంతో రాజకీయ అస్థిరతకు ఇది నిదర్శనంగా మారింది.

భారతదేశం, చైనా, అమెరికా ప్రభావం:

భారతదేశం: సెప్టెంబర్-అక్టోబర్‌లో విద్యార్థి సంఘాలు, విశ్వవిద్యాలయాల్లో అసంతృప్తి మొదలవుతుంది. నవంబర్-డిసెంబర్‌లో ఉపాధి, విద్యా విధానాలపై ఆందోళనలు ఉధృతమవుతాయి. జనవరి 2026 నాటికి ప్రభుత్వం సంస్కరణలను ప్రకటించే పరిస్థితి రానుంది.

చైనా, అమెరికా: ఈ గ్రహణాల ప్రభావం వల్ల యువతలో అసంతృప్తి, సామాజిక ఆందోళనలు పెరుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జ్యోతిష సంబంధం:
చంద్రగ్రహణం సమయంలో శని మీనరాశిలో ఉండటం ప్రజాస్వామ్యంపై ఒత్తిడిని పెంచింది. బృహస్పతి మిథునరాశిలో ఉండటం వల్ల అస్థిరత, నిరసనలకు దారితీసింది. సూర్యగ్రహణం కన్యరాశిలో జరగనుండటంతో ప్రభుత్వ విధానాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

నేపాల్ నుండి ఫ్రాన్స్ వరకు జరిగిన రాజకీయ కుదుపులు చంద్రగ్రహణం ప్రభావానికి ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు అందరి చూపు సెప్టెంబర్ 21న జరగబోయే సూర్యగ్రహణంపైనే ఉంది. ఈసారి ప్రభావం ఏ దేశాలపై పడుతుందో చూడాలి.

ఇవీ చదవండి: Lunar Eclipse : చంద్రగ్రహణం అంటే ఏంటి? ఎందుకు ఏర్పడుతుంది?
Lunar Eclipse : సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. ఈ రాశులు ఎఫెక్ట్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు