HomeNationalFake Medicines : 12 రాష్ట్రాలకు నకిలీ మందుల సరఫరా!

Fake Medicines : 12 రాష్ట్రాలకు నకిలీ మందుల సరఫరా!

Fake Medicines : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో భారీ నకిలీ మందుల రాకెట్ బయటపడింది. డ్రగ్ డిపార్ట్‌మెంట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త దాడిలో హే మా మెడికో, బన్సాల్ మెడికల్ ఏజెన్సీ కార్యాలయాలపై సోదాలు జరిపి పెద్దఎత్తున నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని టెస్ట్‌కు పంపగా, డయాబెటిస్‌ (షుగర్), హృదయ సంబంధిత వ్యాధుల కోసం వాడే ఔషధాలు నకిలీవని తేలింది. Fake Medicines

లంచం ప్రయత్నం, అరెస్టులు:
ఈ కేసులో హే మా మెడికో డైరెక్టర్ హిమాన్షు అగర్వాల్ రూ.1 కోటి లంచం ఇవ్వడానికి ప్రయత్నించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. బన్సాల్ మెడికల్ ఏజెన్సీ యజమాని సంజయ్ బన్సాల్, అతని కుటుంబంలోని ఇద్దరు సభ్యులు కూడా అరెస్టయ్యారు.

12 రాష్ట్రాలకు సరఫరా నెట్‌వర్క్:
నకిలీ మందులు పుదుచ్చేరికి చెందిన మీనాక్షి ఫార్మా, శ్రీ అమన్ ఫార్మా ఫ్యాక్టరీల్లో తయారు చేసి రైలుమార్గం ద్వారా ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో 12 రాష్ట్రాలకు పంపినట్లు దర్యాప్తులో తేలింది. అధికారులు ఇప్పటికే ఈ ఫ్యాక్టరీలను సీజ్ చేశారు.

ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ ఉత్పత్తులు:

రోసువాస్ 20mg, 40mg మాత్రలు (కొలెస్ట్రాల్, హృదయ రోగుల కోసం వాడేవి) సన్ ఫార్మా పేరుతో నకిలీగా తయారు చేసినట్లు బయటపడింది.

అమరిల్ మాత్రలు (డయాబెటిస్ మందులు) సనోఫీ ఇండియా లిమిటెడ్ పేరుతో నకిలీగా విక్రయించారు.

78 లక్షల విలువైన అల్లెగ్రా 120 మాత్రలు స్వాధీనం చేశారు. వీటన్నింటికీ ఒకే బ్యాచ్ నంబర్ ఉండగా, QR కోడ్ స్కాన్ చేయగానే తేడాలు బయటపడ్డాయి.

హెచ్చరిక:
ఈ కేసు ద్వారా నకిలీ మందులు ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయో బయటపడింది. షుగర్, హార్ట్‌ పేషెంట్లకు ఈ ఔషధాలు తీవ్ర ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవీ చదవండి: Fake Medicine: నకిలీ మెడిసిన్‌ను ఎలా గుర్తించాలి? అనుమానం వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
Hyderabad: ఆకతాయిల భరతం పడుతున్న షీటీమ్స్! 1,612 మంది!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు