HomeAstrologyKuja Dosha: కుజ దోషం.. ఈ రాశుల వాళ్లు జాగ్రత్తగా ఉండాలి

Kuja Dosha: కుజ దోషం.. ఈ రాశుల వాళ్లు జాగ్రత్తగా ఉండాలి

Kuja Dosha: జ్యోతిష శాస్త్రంలో కుజ దోషం లేదా మాంగల్య దోషంకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. జాతక చక్రంలో 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో మంగళ గ్రహం సంచరిస్తే ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో దాంపత్య జీవితం, కుటుంబ జీవితం అస్థిరంగా మారే అవకాశం ఉంటుంది. భాగస్వామికి ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, విద్యుత్ దెబ్బలు, విషాహారం లేదా ఎడబాటు వంటి ఇబ్బందులు కలగవచ్చు. (Kuja Dosha)

ఈ దోష నివారణకు స్కంద స్తోత్రం లేదా సుబ్రహ్మణ్యాష్టకం పఠనం శ్రేయస్కరం అంటారు. ముఖ్యంగా మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీనం రాశుల వారు అక్టోబర్ 28 వరకు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి.

మేషం ♈
సప్తమ స్థానంలో మంగళ సంచారం వల్ల దంపతుల మధ్య విభేదాలు పెరుగుతాయి. భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా లేకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.

కర్కాటకం ♋
చతుర్థ స్థానంలో మంగళుడు ఉండటంతో కుటుంబంలో స్పర్థలు పెరుగుతాయి. దంపతుల్లో ఒకరికి బదిలీ అయ్యే పరిస్థితి రావచ్చు. వాహన ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆస్తి వివాదాలు కూడా కలగవచ్చు.

కన్య ♍
కుటుంబ స్థానంలో మంగళ సంచారం వల్ల వాదోపవాదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు దాంపత్యంలో ఒత్తిడిని పెంచవచ్చు. ఒకరికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముంది.

తుల ♎
ఈ రాశిలో మంగళ సంచారం కోపం, అసహనం పెంచుతుంది. అనారోగ్య సమస్యలు, ఉద్యోగ మార్పులు సంభవించవచ్చు. పిల్లల విషయంలో సమస్యలు రావచ్చు. ఓర్పు అవసరం. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఉంటుంది.

వృశ్చికం ♏
అధిపతి అయినా వ్యయస్థానంలో మంగళుడు ఉండడం వల్ల ఎడబాటు కలగవచ్చు. భాగస్వామి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అనారోగ్యం, అధిక ప్రయాణాల వల్ల ఇబ్బందులు రావచ్చు. పెళ్లి ప్రయత్నాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు.

మీనం ♓
అష్టమ స్థానంలో మంగళ సంచారం వల్ల భాగస్వామికి ప్రమాదాల భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విద్యుత్ దెబ్బలు లేదా ఆహార సమస్యలు రావచ్చు. పెళ్లి ప్రయత్నాలు అడ్డంకులు ఎదుర్కొంటాయి.

ఇవీ చదవండి: Pitru Dosha : పితృదోషం ఎవరికి తగులుతుంది? పరిహారాలు ఏంటి?
Navratri 2025: నవరాత్రి వేళ.. ఈ వస్తువులు ఇంట్లోకి తీసుకురావొద్దు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు