Trump Tariffs : భారత్‌పై ఇప్పటికే దిగుమతి సుంకాలను పెంచిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌పై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధికారులను కోరినట్లు సమాచారం. ఇదే తరహా సుంకాలను చైనాపై కూడా అమలు చేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఈ చర్యల ద్వారా రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఆర్థిక ఒత్తిడి సృష్టించాలని ట్రంప్ భావిస్తున్నారు. (Trump Tariffs)
రష్యాపై ఒత్తిడి కోసం కొత్త ఆర్థిక వ్యూహం
వాషింగ్టన్‌లో రష్యాపై ఆంక్షల అంశంపై సీనియర్ అమెరికా, ఈయూ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ట్రంప్, భారత్ మరియు చైనా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆయా దేశాలపై 100% టారిఫ్‌లు విధించడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచవచ్చని సూచించారు. చమురు కొనుగోళ్లు ఆపేస్తామని ప్రకటించే వరకు ఈ కొత్త సుంకాలు కొనసాగించాలని ఆయన ప్రతిపాదించారు.
భారత్‌పై ఇప్పటికే భారీ సుంకాలు
ఈ ఏడాది జూలైలో భారత్‌పై 25% టారిఫ్‌లు విధించిన ట్రంప్, తరువాత వాటిని 50%కి పెంచారు. ఇప్పుడు యూరోపియన్ దేశాలు కూడా 100% టారిఫ్‌లు అమలు చేయాలని సూచించడం అంతర్జాతీయ వాణిజ్యంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వాణిజ్య సంబంధాలపై ట్రంప్ ప్రకటన
తాజాగా సోషల్ మీడియా ద్వారా ట్రంప్, భారత్‌తో వాణిజ్య సంబంధాలను విస్తరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని, త్వరలోనే ప్రధాని మోదీతో దీనిపై మాట్లాడతానని వెల్లడించారు.
ఇవీ చదవండి: Trump on India : ఇండియాపై మళ్లీ ట్రంప్ ఫైర్.. టారిఫ్‌లతో చంపేస్తోంది!
Donald Trump : నేను చచ్చిపోయానా? ట్రంప్ రియాక్షన్ చూడండి!
