HomeSportsKavya Maran : కావ్య మారన్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఆ 25 ఏళ్ల కుర్రాడికే!

Kavya Maran : కావ్య మారన్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఆ 25 ఏళ్ల కుర్రాడికే!

Kavya Maran : SA20 లీగ్ 2026 సీజన్ కోసం జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ప్లేయర్స్ వేలంలో భారీ బిడ్లు నమోదు అయ్యాయి. ఈ సందర్భంలో కావ్య మారన్ యాజమాన్యంలో ఉన్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయడమే కాకుండా, కొత్త కెప్టెన్‌ను కూడా ఎంపిక చేసింది. Kavya Maran

ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు 25 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్కి అప్పగించారు. మొదటి సీజన్‌ నుంచి ఈ జట్టుతో ఉన్న స్టబ్స్, ఇప్పటివరకు అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇంతకుముందు కెప్టెన్‌గా ఉన్న ఐడెన్ మార్క్రమ్, 2023 మరియు 2024లో జట్టును ఛాంపియన్లుగా నిలబెట్టాడు. కానీ ఈసారి జరిగిన వేలంలో డర్బన్ సూపర్ జెయింట్స్ (DSG) మార్క్రమ్‌ను సుమారు రూ.7 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దాంతో సన్‌రైజర్స్ కొత్త నాయకుడిని ఎంపిక చేయాల్సి వచ్చింది.

ట్రిస్టన్ స్టబ్స్ ప్రదర్శన
స్టబ్స్ ఇప్పటివరకు SA20లో 140.11 స్ట్రైక్ రేట్‌తో 723 పరుగులు సాధించాడు. వికెట్ కీపింగ్‌లోనూ తన ప్రతిభను చూపుతూ జట్టుకు అనేక సార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అందించాడు. ఈ కారణంగానే అతడిపై నమ్మకం ఉంచి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా, వేలానికి ముందు సన్‌రైజర్స్ అతడిని రిటైన్ చేసుకోగా, ఇంగ్లాండ్ స్టార్ జానీ బెయిర్‌స్టోను ప్రీ-సైన్ చేసింది.

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు

క్వింటన్ డి కాక్
మాథ్యూ బ్రీట్జ్కే
ఎన్రిక్ నోర్ట్జే
సెనురాన్ ముత్తుసామి
పాట్రిక్ క్రుగర్
లుథో సిపామ్లా
మిచెల్ వాన్ బురెన్
జోర్డాన్ హర్మన్
జేమ్స్ కోల్స్
క్రిస్ వుడ్
లూయిస్ గ్రెగొరీ
సీజే కింగ్
జేపీ కింగ్
బేర్స్ స్వాన్‌పొల్

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పూర్తి జట్టు (SA20 2026)
ట్రిస్టన్ స్టబ్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (wk), క్వింటన్ డి కాక్ (wk), మాథ్యూ బ్రీట్జ్కే, అల్లాహ్ గజన్‌ఫర్, మార్కో జాన్సెన్, ఆడమ్ మిల్నే, ఎన్రిక్ నోర్ట్జే, జోర్డాన్ హర్మన్, సెనురాన్ ముత్తుసామి, లూయిస్ గ్రెగొరీ, పాట్రిక్ క్రుగర్, బేర్స్ స్వాన్‌పొల్, లుథో సిపామ్లా, మిచెల్ వాన్ బురెన్, క్రిస్ వుడ్, సీజే కింగ్, జేపీ కింగ్.

ఇవీ చదవండి: The Hundred : కావ్య మారన్ సాధించింది.. కప్పు కొట్టిన వేళ.. ఎక్కడంటే!
Esther Anil: దృశ్యం చిన్నది.. గ్లామర్‌తో కవ్విస్తున్నది

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు