Pitru Paksha : బాధ్రపద మాసంలో పౌర్ణమి, పూర్వాబాధ్ర నక్షత్ర పౌర్ణమి తెల్లవారి నుంచి అంటే పాఢ్యమి నుంచి వచ్చే అమావాస్య వరకు పితృపక్షాలుగా జరుపుకుంటారు. ఈ ఏడాది 2025 సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్న 15 రోజుల సమయాన్ని పితృపక్షాలు అంటారు. Pitru Paksha
పితృపక్షాలు ఎందుకు వచ్చాయి?
కర్ణుడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడు. యమలోకానికి పోయిన తర్వాత యముణ్ణి చూసి ఆశ్చర్యచకితుడవుతాడు. వెంటనే యముడితో మాట్లాడుతూ.. నేను ఇన్ని దానాలు చేశాను.. వజ్ర వైఢూర్యాలు, ఉన్నదల్లా దానం చేశాను.. నేను ఎందుకు నరకానికి వచ్చాను? అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు ఇలా చెబుతాడు.. కర్ణా.. నువ్వు చాలా దానాలు చేశావు.. బంగారు, వజ్ర వైఢూర్యాలు, నగలు దానం చేశావు.. కానీ అన్నదానం మాత్రం నువ్వు చేయలేదు.. అంటాడు. అన్ని దానాల కంటే అన్నదానం ఉత్తమమైనదని అప్పటి నుంచే వచ్చిందని పెద్దలు చెబుతున్నారు.
స్వర్గానికేగిన కర్ణుడు
అలా చెప్పిన యమధర్మరాజును కర్ణుడు ఇలా అడుగుతాడు.. దీనికి నాకు ఏదైనా ఉపాయం ఉందా? చెప్పండి అని కోరుతాడు. అప్పుడు యమధర్మరాజు పితృపక్షాలు అనే 15 రోజులను ఏర్పాటు చేసి, తిరిగి భూమి మీదకు మళ్లీ కర్ణుడిని పంపుతాడు. ఆ కర్ణుడు 15 రోజులపాటు పూర్తిగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తాడు. అనంతరం స్వర్గానికి ఏతెంచుతాడు. అందుకే పితృదేవతలకు సంబంధించి ఎలాంటి దాన, అన్నదాన కార్యక్రమాలు ఏవైనా చేయడానికి ఈ 15 రోజులు అనేది చాలా ఉపయుక్తం.
దేనికి ప్రాశస్త్యం?
చాలా మంది తిథి తెలియని వారు ఉంటారు. మన పూర్వీకులు, పెద్దలు ఏ తిథిలో చనిపోయారు అనేది చాలా మందికి తెలియదు. హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజు అనేది నక్షత్రం రోజున చేస్తారు. అదే సంవత్సరీకం, తద్దినం అనేవి తిథిరోజున జరుపుకుంటారు. అంటే ఈ తిథి ఎవరికైతే తెలియదో వాళ్లందరూ ఈ పితృపక్షాల 15 రోజులపాటు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 21వ తేదీ మహాలయ పితృపక్ష అమావాస్య వరకు ఎవరైతే వారి పెద్దల పేరు మీద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారో.. వారందరికీ కుటుంబం గానీ, వంశం గానీ, గోత్రం గానీ అభివృద్ధి పథంలోకి వెళ్తుంది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 7వ తేదీ గ్రహణం ఏర్పడుతుంది. 8వ తేదీ నుంచి పితృపక్షాలు మొదలయ్యాయి. మీ పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలన్నా, మీకు తిథి, వార నక్షత్రాలు తెలియకున్నా కచ్చితంగా ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు అన్నదానం నిర్వహించుకోవచ్చు.
అన్నదానమంటే తెల్ల అన్నం, పప్పు, పుసులు లాంటివే..
అన్నదానం అంటే ఈ పితృపక్షాల సమయంలో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే. బిర్యానీ, పులిహోర లాంటివి కాదు. తెల్ల అన్నం తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలి. పప్పు, సాంబారు, నెయ్యి ఇలాంటివి పేదవాళ్లకు పెట్టాలి. ఏదైనా దేవాలయానికి బియ్యం, పప్పులు, నూనె, ఉప్పు లాంటివి అక్కడి పంతులుకు దానం ఇవ్వాలి. గుడిలోకి వెళ్లడానికి ఇష్టం లేదనుకుంటే రోడ్డుమీద తిండికి లేకుండా ఉంటున్న పేద వారికి అన్నదానం చేయండి. కనీసం ఒక్కరికైనా అన్నదానం చేయాలి. స్తోమత కలిగితే 100 మందికి గానీ, 10 మందికి గానీ, 20 మందికి గానీ పెట్టాలి. పప్పు, పులుసు, కూర లాంటివి మాత్రమే తెల్ల అన్నంతో కలిపి పెట్టాలి.
ఇలా చేయడం వల్ల మీ గోత్రం, మీ ఇంటిపేరు, మీ వంశం అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే మీ పూర్వీకులకు సంబంధించిన పితృదోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా, నాగదోషాలున్నా తొలగిపోతాయి.
ఇవీ చదవండి: Pitru Pakshalu : పితృపక్షాలంటే ఏమిటి? ప్రాముఖ్యత..?
Sutakam: సూతకం ఉన్నప్పుడు ఏ పనులు చేయకూడదు? ఏవి చేయొచ్చు?
Pitru Dosha : పితృదోషం ఎవరికి తగులుతుంది? పరిహారాలు ఏంటి?
