Andhra Pradesh : సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న కొద్దీ, ప్రైవసీకి సంబంధించిన సమస్యలు కూడా తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా యువతులు, మహిళలు అప్రమత్తంగా లేకపోతే ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఎక్కువ. తాజాగా విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ ఇలాంటి ఘటనను ఎదుర్కొన్నారు. (Andhra Pradesh)
ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తరచూ స్టోరీస్, ఫోటోలు షేర్ చేస్తూ ఉండేది. ఒక రోజు ఆమెకు అపరిచిత అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే షాక్ అయ్యింది. ఎందుకంటే, అందులో ఆమె అసలు ఫోటోలను అశ్లీలంగా మార్ఫ్ చేసి పంపించారు. వెంటనే మరో మెసేజ్‌లో “చెప్పినట్టు చేయకపోతే ఈ ఫోటోలను అందరికీ పంపిస్తాను” అంటూ బెదిరింపులు వచ్చాయి.
ఆ అకౌంట్ ఫేక్ అని తెలుసుకున్న బాధితురాలు చివరికి ధైర్యం చేసి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. సాధారణ ఫోటోలను డౌన్‌లోడ్ చేసి, ఆన్‌లైన్ టూల్స్ ద్వారా మార్ఫ్ చేసినట్లు బయటపడింది. నిందితుడు నంద్యాల జిల్లాకు చెందిన గురునాథ్ అని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.
పోలీసుల సూచనలు:
* సోషల్ మీడియా అకౌంట్లను ఎల్లప్పుడూ ప్రైవేట్‌గా ఉంచాలి.
* అపరిచితుల నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించకూడదు.
* తెలియని వ్యక్తులతో అనవసరంగా సాన్నిహిత్యం వద్దు.
* తెలియని లింక్‌లపై క్లిక్ చేయరాదు.
* సైబర్ మోసాలకు గురైనవారు వెంటనే http://www.cybercrime.gov.in
* టోల్ ఫ్రీ నెంబర్ 1930, లేదా 7995095799 కు ఫిర్యాదు చేయవచ్చు.
👉 ఈ ఘటన మరోసారి సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని అందరికీ హెచ్చరిస్తోంది.
ఇవీ చదవండి: Cyber Attack : జాగ్వార్ ల్యాండ్ రోవర్‌పై సైబర్ అటాక్.. కోట్ల విలువైన దెబ్బ!
Alia Bhat : ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ అరెస్టు.. రూ. 76.9 లక్షల మోసం!
