Team India: సెప్టెంబర్ 4న యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే టీ20 ఆసియా కప్ 2025 కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఈ టోర్నమెంట్ కోసం 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. అందులో 15 మంది ప్రధాన జట్టులో ఉండగా, ఐదుగురు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. అయితే, రిజర్వ్ ప్లేయర్లలో ఒకరైన వికెట్ కీపర్-బ్యాటర్ ధ్రువ్ జురెల్ డెంగ్యూ జ్వరానికి గురయ్యాడు. (Team India)
దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకున్న జురెల్
ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ జట్టుకు కెప్టెన్సీ వహించాల్సింది జురెలే. కానీ డెంగ్యూ కారణంగా అతను అందుబాటులో లేకపోవడంతో, సెంట్రల్ జోన్ జట్టుకు ఇది పెద్ద లోటుగా మారింది. క్వార్టర్ ఫైనల్‌లో కూడా గజ్జ గాయంతో ఆడలేకపోయిన జురెల్ వరుసగా మరోసారి కీలక మ్యాచ్‌కి దూరమయ్యాడు. అతని స్థానంలో విదర్భ కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ ను జట్టులో చేర్చారు.
ఆసియా కప్‌లో ప్రభావం ఉండదు
జురెల్ ప్రధాన జట్టులో కాకుండా రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక కావడంతో, అతని అనారోగ్యం ఆసియా కప్‌లో టీమిండియా ప్లాన్‌లపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే రిజర్వ్ ఆటగాళ్లు ప్రధాన జట్టుతో యూఏఈకి వెళ్లరు. 15 మందిలో ఎవరైనా గాయపడ్డప్పుడు మాత్రమే వీరికి అవకాశం దక్కుతుంది.
సెంట్రల్ జోన్ స్క్వాడ్
రజత్ పాటిదార్ (కెప్టెన్)
ర్యాన్ జుల్, డానిష్ మలేవార్, సంజీత్ దేశాయ్, యశ్ ఠాకూర్, ఆదిత్య ఠాక్రే, దీపక్ చాహర్, అక్షయ్ వాడ్కర్, ఎ. సరాంశ్ జైన్, ఆయుష్ పాండే, శుభమ్ శర్మ, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, మానవ్ సుమెద్, కేహల్ అహ్తర్
స్టాండ్‌బై ప్లేయర్స్: మహిపాల్ లోమ్రోర్, మధ్వా కౌశిక్, యువరాజ్ చౌదరి, కుల్దీప్ సేన్, ఉపేంద్ర యాదవ్
ఇవీ చదవండి: Bumrah : భారత జట్టు టెస్టు కెప్టెన్సీ ఆఫర్.. బుమ్రా వద్దనడంపై వివాదం
Asia Cup 2025: టీ20 వరల్డ్ కప్ హీరోకు అవమానం..!
