HomeAndhra PradeshBreaking News : ఏపీ కేబినెట్ భేటీ.. ఢిల్లీకి లోకేష్.. నేటి ప్రధాన వార్తలు (04.09.2025)

Breaking News : ఏపీ కేబినెట్ భేటీ.. ఢిల్లీకి లోకేష్.. నేటి ప్రధాన వార్తలు (04.09.2025)

Breaking News : నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. నేడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులెటర్ ను కేఆర్ఏంబి చైర్మన్ పాండే సందర్శించనున్నారు. ఇవాళ్టి టాప్ న్యూస్ ఇవీ.. (Breaking News)

1. నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. సీఆర్డీఏ అథారిటీ అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. ఈనెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్న కేబినెట్

2. విశాఖ: రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన.. అంతర్జాతీయ మీడియేషన్ సదస్సుకు హాజరుకానున్న సీఎం. సదస్సుకు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరు.

3. రేపు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. మాడగడ గిరిజన గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులు నిర్వహించే “బలి పోరబ్” లో పాల్గొననున్న పవన్ కల్యాణ్.

4. అమరావతి: నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్.. ఢిల్లీలోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి నారా లోకేష్.

5. నంద్యాల: నేడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులెటర్ ను సందర్శించనున్న కేఆర్ఏంబి చైర్మన్ పాండే.. పోతిరెడ్డిపాడు గేట్ల పరిశీలన, దిగువ కు నీటి విడుదల వివరాలను తెలుసుకోనున్న కేఆర్ఏంబి చైర్మన్

6. లిక్కర్ కేసులో అనూహ్యంగా తెరపైకి సజ్జల భార్గవ్ పేరు.. మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్న కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్న సజ్జల భార్గవ్. స్కామ్ లో కొల్లగొట్టిన డబ్బును రూటింగ్ చేసేందుకు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని భావిస్తున్న సిట్

7. నేడు చెవిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ.. లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి

8. విజయవాడ: నేటితో ముగియనున్న ఐపీఎస్ సంజయ్ పోలీస్ కస్టడీ.. మూడు రోజులుగా సంజయ్ ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు

9. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీఐ ఓవరాక్షన్.. వినాయక నిమజ్జనంలో సీఐ శ్రీనివాసులు హల్ చల్. భక్తులను బూటుకాళ్లతో తన్నిన సీఐ శ్రీనివాసులు. డీజే సౌండ్ అధికంగా పెట్టారని బూటుకాళ్లతో తన్నిన సీఐ శ్రీనివాసులు. సీఐపై కఠినచర్యలు తీసుకోవాలని VHP డిమాండ్.. చర్యలు తీసుకోకపోతే నిరసనలకు దిగుతామని హెచ్చరికలు

10. ఢిల్లీలో నేడు రెండో రోజు GST కౌన్సిల్ సమావేశాలు.. మరికొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం. ఇప్పటికే శ్లాబ్‌లపై నిర్ణయాలు ప్రకటించిన కౌన్సిల్. 12, 28 శాతం శ్లాబ్‌లు తొలగించిన జీఎస్టీ కౌన్సిల్.. 5, 18 శాతం శ్లాబ్‌లు కొనసాగింపు. లగ్జరీ వస్తువులపై 40 శాతం జీఎస్టీ విధింపు.

ఇవీ చదవండి: YS Jagan : చంద్రబాబు రైతులను గాలికి వదిలేశారు: జగన్
YSR Vardhanthi : వైయస్ వర్ధంతి.. YSR ఘాట్ వద్ద జగన్ నివాళి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు