Banana Tea : మనలో చాలామంది అరటిపండు తిన్న తర్వాత తొక్కను వృథా చేస్తున్నాం. కానీ, ఆ తొక్కలోనూ ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో గుణాలు ఉన్నాయని మీకు తెలుసా? తాజాగా నిపుణులు చెబుతున్న పరిశోధనల ప్రకారం, అరటి తొక్కతో చేసిన టీ ఆరోగ్యానికి అమృతం లాంటిదని తేలింది. (Banana Tea)
అరటి తొక్క టీ తయారీ విధానం
* ముందుగా పండిన అరటి తొక్కలను బాగా కడగాలి.
* వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
* ఒక గ్లాస్ నీటిలో ఈ తొక్క ముక్కలను వేసి బాగా మరిగించాలి.
* 10 నిమిషాలు మరిగించిన తర్వాత నీటిని వడగట్టి టీలా తాగాలి.
* ఇందులో ఎలాంటి పంచదార లేదా ఉప్పు కలపకుండా తాగితేనే అసలు లాభం దక్కుతుంది.
అరటి తొక్క టీ లాభాలు
రిచ్ ఫైబర్: ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.
డైజషన్ సిస్టమ్ రిపేర్: కడుపు సమస్యలు, గ్యాస్, అజీర్ణం వంటి ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది.
విటమిన్ సి: రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది.
డార్క్ స్పాట్స్ తగ్గింపు: ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ఉన్న నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.
స్లీప్ క్వాలిటీ మెరుగుదల: అరటి తొక్కలో ఉండే ట్రిప్టోఫాన్ నరాలను ప్రశాంతం చేసి మంచి నిద్రకు తోడ్పడుతుంది.
ఒత్తిడి తగ్గింపు: శరీరానికి రిలాక్సేషన్ ఇచ్చి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
రోజూ ట్రై చేయండి
ఇప్పటివరకు వృథా చేస్తున్న అరటి తొక్కను ఇకపై ఇలా ఉపయోగించండి. అరటి తొక్క టీని రోజూ ఒకసారి తాగితే ఆరోగ్యానికి, అందానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి.
ఇవీ చదవండి: Banana: అరటిపండు మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా? అతిగా తింటే ఏమవుతుందంటే..
Monsoon Fruits : వర్షాకాలంలో తినకూడని పండ్లు ఏవి?
Munaga Podi : మునగాకు పొడితో ఎలాంటి రెసిపీలు చేసుకోవచ్చంటే..!
Piles : పైల్స్ ప్రాబ్లమ్ బాగా ఇబ్బందిపెడుతోందా? నేచురల్ రెమెడీస్
Night Sleep : రాత్రిపూట పడుకోగానే నిద్ర రావాలా? టిప్స్ ఇవీ!
