Jaggu Bhai and King : తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త వినోదాన్ని అందిస్తున్న జీ తెలుగు, ఈసారి ఓ స్పెషల్ గిఫ్ట్‌తో రానుంది. ప్రముఖ నటుడు జగపతి బాబు తొలిసారిగా హోస్ట్‌గా వ్యవహరించబోతున్న కొత్త టాక్ షో “జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి” త్వరలో ప్రారంభం కానుంది. (Jaggu Bhai and King)
వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ షోలో ప్రతి వారం ఒక ప్రముఖ సినీ తార గెస్ట్‌గా హాజరవుతూ, తమ జీవితంలోని జ్ఞాపకాలు, అనుభవాలు, వినోదభరితమైన సంగతులను పంచుకోనున్నారు.
గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మొదటి గెస్ట్‌గా రానున్నారు. ఈ ఎపిసోడ్‌లో ఆయన తన కెరీర్‌లోని మైలురాళ్లు, వ్యక్తిగత జీవితం, కుటుంబం, అన్నపూర్ణ స్టూడియోస్‌తో ఉన్న అనుబంధం వంటి ఆసక్తికర విషయాలను పంచుకోనున్నారు. అంతేకాక, అక్కినేని కుటుంబంలోని మరికొందరు సభ్యులు కూడా ముఖ్య అతిథులుగా హాజరై, నాగార్జున గురించి మరిన్ని మధురమైన జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకుంటారు.
జగపతి బాబు తనదైన హాస్యపు టచ్, స్టైల్‌తో షోని నడిపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతున్నారు. సినిమా తెరపై దశాబ్దాలుగా తన నటనతో ఆకట్టుకున్న ఆయన, ఈసారి బుల్లితెరపై హోస్ట్‌గా కొత్త అవతారంలో అలరించనున్నారు.
టెలికాస్ట్ వివరాలు:
జీ5 లో ప్రీమియర్: ఆగస్టు 15
జీ తెలుగులో టెలికాస్ట్: ఆగస్టు 17, ఆదివారం రాత్రి 9 గంటలకు
ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు కొత్త ఎపిసోడ్
మీరు కూడా రెడీగా ఉండండి… కింగ్ నాగార్జున పంచబోయే విశేషాలు, జగపతి బాబు వినిపించే సరదా మాటలు మిస్ అవ్వకండి!
ఇవీ చదవండి: Nagarjuna Akkineni: కొండా సురేఖపై అక్కినేని నాగార్జున ఆగ్రహం
Coolie : రజనీకాంత్ కూలీ మూవీ.. ఈ విషయాలు తెలుసా?
Bhagyashri Borse : అదరగొడుతున్న ముద్దుగుమ్మ.. రెడీ ఫర్ కింగ్‌డమ్!
Naga Chaitanya: నాగచైతన్య, శోభిత మిర్రర్ సెల్ఫీ.. కామెంట్స్ ఆపేసిన చై..!
Rashmika Mandanna : రష్మిక మంధన్న.. 2025-27లో బ్లాక్‌బస్టర్ లైనప్
